అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India CEO Resignation | టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (CEO Campbell Wilson) రాజీనామా చేశారు. 2022లో ఐదేళ్ల కాంట్రాక్ట్‌పై ఆయన నియమితులయ్యారు. విల్సన్ పదవీకాలం జూలై 2027లో ముగియనుంది. అంతలోపే ఆయన రాజీనామా చేశారు.
ఎయిరిండియా (Air India) ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. గతేడాది అహ్మదాబాద్‌లో ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిన ఘటనలో 260 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం, నిరంతర నష్టాలు, పెరిగిన నియంత్రణ సంస్థల పరిశీలనతో సతమతమవుతున్న ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారని సమాచారం.
Air India CEO Resignation | భారీగా నష్టాలు
టాటా సన్స్ గ్రూప్ (Tata Sons Group)లోని ఎయిరిండియా ఆర్థిక సంవత్సరం 2026లో సుమారు రూ. 29 వేల కోట్ల నష్టాన్ని నమోదు చేస్తుందని అంచనా.
2025 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 11,000 కోట్లుగా ఉంది. పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం, 100 డాలర్లకు పైగా పెరిగిన ముడి చమురు ధరలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) వంటి అనేక బాహ్య ఒత్తిళ్లతో సంస్థ నష్టాలు పెరిగాయి. 191 బోయింగ్, ఎయిర్‌బస్ విమానాల సముదాయాన్ని కలిగిన ఈ భారతీయ విమానయాన సంస్థను టాటా గ్రూప్ 2022లో కొనుగోలు చేసింది. ఎయిర్ ఇండియాకు ఎన్. చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా ఉన్నారు, ఆయన టాటా గ్రూప్‌కు కూడా ఛైర్మన్‌గా ఉన్నారు. టాటాతో పాటు, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఇండియాలో 25 శాతం వాటా ఉంది. అయితే సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో సీఈవో రాజీనామా చేయడం గమనార్హం.
Air India CEO Resignation | విల్సన్ నేపథ్యం
క్యాంప్‌బెల్ విల్సన్‌కు విమానయాన రంగం (Aviation Sector)లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022లో ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమితులయ్యారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) పూర్తి యాజమాన్యంలోని లో-కాస్ట్ అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈవోగా కూడా సేవలందించారు. కాగా ఇటీవల ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు
