అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air India Flight Return | ఓ విమానం 8 గంటల పాటు ప్రయాణించిన తర్వాత.. గమ్యస్థానంలో దిగకుండా తిరిగి వచ్చింది. దీంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. గమ్యస్థానానికి బదులుగా బయలుదేరిన ప్రదేశానికే ఎందుకు తిరిగి వచ్చారనే కారణాలపై విమానంలోని ప్రయాణికులందరూ ఆందోళనకు గురయ్యారు.
ఏదైనా ఊహించని సమస్య తలెత్తినప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలను దారి మళ్లిస్తారు. లేదా వెనక్కి తిరిగి వచ్చేలా చేస్తారు. కానీ కెనడాకు వెళ్తున్న ఒక ఎయిర్ ఇండియా విమానం గమ్యస్థాన దేశంలో ప్రయాణించడానికి దానికి అనుమతి లేదని ఎయిర్‌లైన్ ప్రధాన కార్యాలయం (Airline Headquarters)లోని అధికారులు గుర్తించడంతో ఢిల్లీకి తిరిగి వచ్చింది.
Air India Flight Return | గమనించేలోపే..
ఎయిర్ ఇండియా (Air India)కు ప్రస్తుతం కెనడాకు తన బోయింగ్ 777-300ER విమాన సర్వీసులను మాత్రమే నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల బోయింగ్ 777-200LR విమానం ప్రయాణికులతో బయలు దేరింది. దేశాలు ఇచ్చే విమానయాన అనుమతులు విమానయాన సంస్థలను బట్టి వేర్వేరుగా ఉండవచ్చు. ఈ సమస్యను గమనించేలోపే, ఆ విమానం కున్మింగ్ సమీపంలో చైనా గగనతలంలోకి ప్రవేశించింది. వెంటనే అధికారులు పైలెట్లకు సమాచారం ఇవ్వడంతో గాలిలోనే యూ టర్న్ తీసుకుని బయలుదేరిన ప్రదేశానికి తిరిగి వచ్చింది. ఆ విమానం బయలుదేరిన చోటే దిగడానికి మొత్తం 7 గంటల 54 నిమిషాలు ప్రయాణించింది.
Air India Flight Return | ఎయిర్ ఇండియా ప్రకటన
AI185 నంబరు గల విమానం గురువారం ఉదయం 11:34 గంటలకు ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ (Delhi) నుంచి కెనడాకు బయలుదేరింది. గల్ఫ్ దేశాలలో కొనసాగుతున్న సమస్యల కారణంగా అది అసాధారణమైన తూర్పు మార్గం ద్వారా వాంకోవర్‌లో దిగాల్సి ఉంది. అయితే దాదాపు నాలుగు గంటల ప్రయాణం పూర్తి చేసిన తర్వాత వెంటనే ఢిల్లీకి తిరిగి రావాలని పైలట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. సాయంత్రం 7:30 గంటలకు ఆ విమానం తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ సంస్థ (Airline Company) ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని మండిపడ్డారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి..: Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్

