Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్

తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క‌పిల తీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై వాకర్లు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 2, 2026 11:28 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Alipiri Walkers Protest
Alipiri Walkers Protest

అక్షరటుడే, వెబ్​డెస్క్: Alipiri Walkers Protest | తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క‌పిల తీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై వాకర్లు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది.

Alipiri Walkers Protest | ప్రవేశ రుసుముపై వివాదం

అలిపిరి సమీపంలోని దివ్యరామంలో ఉన్న నగరవనంలో వాకింగ్ చేసేందుకు అటవీశాఖ అధికారులు (Forest Officers) నెలకు రూ.100 ప్రవేశ రుసుము చెల్లించాలని కొత్త నిబంధన అమలు చేశారు. ఈరోజు ఉదయం రుసుము చెల్లించని వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన వాకర్లు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. డీఎఫ్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు వాకర్స్ సంఘంలోని సీపీఎం నాయకులు (CPM Leaders) ముందుండి నాయకత్వం వహించారు.

తిరుమల వెళ్లే మార్గం కావడంతో వాహనాల్లో ఉన్న భక్తులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంతసేపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉదయం వేళలో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలుసుకున్న అలిపిరి సీఐ రామకిశోర్ (CI Ramkishore) వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఫీజు అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వాకర్లు తమ నిరసనను విరమించారు.

అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పరిస్థితి క్రమంగా సాధారణమైంది.నగరవనం ప్రవేశ రుసుము అంశంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి..: Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..

KA Paul Iran Israel War | వారంలో యుద్ధం ముగుస్తుంది : కేఏ పాల్
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
driving license grading points | డ్రైవింగ్​ లైసెన్స్​కు ఇక గ్రేడింగ్​ పాయింట్లు.. తప్పుల పుట్ట పెరిగితే లైసెన్స్​ రద్దు
Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
TAGGED:Alipiri breaking newsAlipiri walkers protestCI RamkishoreKapila Theertham road protestNagaravanam entry feeTirumala route disruptionTirupati local newsTirupati traffic jamTraffic JamWalkers agitation Andhra Pradesh
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Iran Amazon Data Center Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
Next Article LB Nagar Car Accident LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?