అక్షరటుడే, వెబ్‌డెస్క్: Allu Arjun Raaka First Look | “పుష్ప 2” వంటి అరివీర భయంకర విజయానంతరం అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి వచ్చే తదుపరి సినిమా ఏమిటి అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల్లో పెరిగింది.
మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో సినిమా ఉంటుందని భావించినా, అనూహ్యంగా దర్శకుడు అట్లీ (Director Atlee Kumar) లైన్‌లోకి రావడంతో ఈ ప్రాజెక్ట్ హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికే ప్రీ-లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా, తాజాగా “రాకా (Raaka)” అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అల్లుఅర్జున్ సగం మనిషిగా, సగం తోడేలులాంటి మృగంగా కనిపించడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.
Allu Arjun Raaka First Look | మాములుగా లేదు..
ఈ డిఫరెంట్ గెటప్ చూసిన ఫ్యాన్స్ “అట్లీ మామ ఏం ప్లాన్ చేస్తున్నావ్?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గత సంవత్సరం బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు సృష్టించింది. దాదాపు 2 నిమిషాల 30 సెకన్ల వీడియోలో కనిపించిన విజువల్స్, కాన్సెప్ట్ చూస్తే ఇది సాధారణ సినిమా కాదని స్పష్టమైంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందనుందని అప్పుడే క్లారిటీ వచ్చింది.
Allu Arjun Raaka First Look | సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, “రాకా” పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీగా తెరకెక్కనుంది. ఇందులో విభిన్న రకాల రాక్షసులు, జంతువులు, మరియు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఇండియన్ సినిమాలో చూడని విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో అట్లీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాస్టింగ్, బడ్జెట్, టెక్నికల్ టీమ్ కలిసి ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఇది కూడా చదవండి..: Pawan Kalyan Family Emotional Day | ఏప్రిల్ 8 పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎమోషనల్ డే.. ఒక కొడుకు బర్త్‌డే, మరో కొడుక్కి పునర్జన్మ!
