Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..

క్రైంనిజామాబాద్

Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..

ఆలూర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఏకంగా పది తులాల వరకు బంగారం నగదు చోరీ చేశారు. దీంతో ఆలూర్​లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 20, 2026 7:20 సా.
Shashi kiran Mottala
6 రోజులు ago
Share
Alur House Theft |
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..

అక్షరటుడే, ఆర్మూర్: Alur House Theft | ఆలూర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఏకంగా పది తులాల వరకు బంగారం, నగదు చోరీ (Gold Theft India) చేశారు. దీంతో ఆలూర్​లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Contents
  • Alur House Theft | తాళం వేసిన ఇళ్లే టార్గెట్​..
    • Alur House Theft | చిందరవందరగా వస్తువులు..

Alur House Theft | తాళం వేసిన ఇళ్లే టార్గెట్​..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్​ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న(House Burglary) దుండగులు, ఇంట్లోని బీరువాలను పగులగొట్టి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదును అపహరించారు. గ్రామానికి చెందిన తలారి జమున ఈనెల 15న సాయంత్రం తన ఇంటికి తాళం వేసి జుక్కల్‌లో నివసిస్తున్న తన చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు అనుమానం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Alur House Theft | చిందరవందరగా వస్తువులు..

సమాచారం అందుకున్న జమున కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకుని ఇంటిని పరిశీలించగా, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా (Telangana Crime News) కనిపించాయి. దుండగులు బీరువాలను పగులగొట్టి అందులో దాచిన బంగారు ఆభరణాలు, (Nizamabad Crime) నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అపహరించబడిన బంగారంలో మూడు తులాల తీగ, సుమారు రెండున్నర తులాల నెక్లెస్, రెండున్నర తులాల పుస్తెల తాడు, రెండు తులాల బంగారు గాజులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఆర్మూర్ సీఐ సత్యనారాయణ  (Telangana Crime) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

box1

ఇది కూడా చదవండి: SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
Sarpanch Training Program | సర్పంచులకు శిక్షణ ప్రారంభం
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
TAGGED:House BurglaryLocal crime updateNizamabad CrimePolice investigationTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SSC Exams SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Next Article Telangana Nominated Posts Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్​​ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్​ నేతల కీలక భేటీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?