అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amaravati Farmers Protest | సాధారణంగా వార్తలు చదివేటప్పుడు గొంతులో గంభీరత, ముఖంలో గాంభీర్యం ఉంటే సరిపోతుంది. కానీ, నేటి ‘ఎమోషనల్ జర్నలిజం’ యుగంలో కేవలం మాటలు సరిపోవు.. కొంచెం యాక్షన్, మరికొంత సెంటిమెంట్ కావాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తూ ఒక జర్నలిస్టు.. అమరావతి రైతుల భూ త్యాగాన్ని స్మరిస్తూ స్టూడియోలోనే దీపం వెలిగించి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు.
Amaravati Farmers Protest | ఆవేదన దీపం!
రైతుకు భూమి అంటే కేవలం మట్టి కాదు, అది వారి ప్రాణంగా భావిస్తారు. ఏపీ రాజధాని కోసం ఆ ప్రాణాలను పణంగా పెట్టిన అమరావతి రైతుల ఆవేదనను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ జర్నలిస్టు ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టూడియోలో దీపం చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Amaravati Farmers Protest | రైతుల పోరాటం
అమరావతి రైతుల పోరాటం నిరంతరం వెలుగుతూనే ఉండాలని, వారి ఆశయాలు మసకబారకూడదని ఈ ‘దీప ప్రజ్వలన’ వెనుక ఉన్న అసలు ఆంతర్యం కావొచ్చు. అయితే, వార్తా కథనాన్ని సైతం ఒక సినిమా సీన్‌లా రక్తి కట్టించడంలో మన జర్నలిస్టులు చూపిస్తున్న చొరవ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో వార్తా బులెటిన్ల కోసం ప్రత్యేకంగా ‘స్క్రీన్ ప్లే’ రచయితలను పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇది కూడా చదవండి..: Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్‌లో దాచి!
స్టూడియోలో ధ్యానం!!! pic.twitter.com/a726ndDsj6
— The Samosa Times (@Samotimes2026) April 2, 2026
