Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!

జాతీయంతాజా వార్తలు

Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!

బ్రెయిన్ డెడ్​కు గురైన మహిళకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అంత్యక్రియల కోసం ఆసుపత్రి నుంచి అంబులెన్స్​లో తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Naresh chandan
Last updated: మార్చి 11, 2026 11:00 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ambulance Miracle Incident | ఆ మహిళ బ్రెయిన్ డెడ్​ Brain Dead కు గురైంది. బాధిత కుటుంబం ఆమె ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అంత్యక్రియల కోసం ఆసుపత్రి నుంచి అంబులెన్స్​లో ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మార్గమధ్యలో రోడ్డుపై గుంత కారణంగా అంబులెన్స్​ ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. అదే సమయంలో అద్భుతం జరిగింది. అపస్మారక స్థితిలో ఆమె తిరిగి ఊపిరి తీసుకోవడం మొదలెట్టింది.

Contents
  • Ambulance Miracle Incident | పరిస్థితి విషమించడంతో..
    • Ambulance Miracle Incident | భారీ కుదుపుతో..

అనూహ్యంగా జరిగిన ఘటనతో ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరిగి హాస్పిటల్​కు తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించగా.. ఆమె తిరిగి పూర్తిగా కోలుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్​లో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Ambulance Miracle Incident | పరిస్థితి విషమించడంతో..

యూపీలోని పీలీభీత్ జిల్లాలో ఉండే వినితా శుక్లా.. అక్కడి జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా గత నెల (ఫిబ్రవరి) 22వ తేదీన ఇంటి పనులు చేస్తుండగా సడెన్​గా కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో బరేలీలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను మూడు రోజుల పాటు వెంటిలేటర్​పై ఉంచారు. ఆమె ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్​లో తిరిగి ఇంటికి తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు.

Ambulance Miracle Incident | భారీ కుదుపుతో..

అదే నెల (ఫిబ్రవరి) 24వ తేదీన అంబులెన్సులో వినితాను తీసుకుని ఇంటికి బయలుదేరారు. కాగా, హరిద్వార్ – బరేలీ జాతీయ రహదారిపై ఓ చోట పెద్ద గుంత ఉంది. అందులో నుంచి అంబులెన్స్​ వెళ్లడంతో వాహనం ఒక్కసారిగా భారీ కుదుపునకు గురైంది. ఆ కుదుపునకు అంబులెన్స్​లో అపస్మారక స్థితిలో ఉన్న వినితా స్పృహలోకి వచ్చి, శ్వాస తీసుకోవడం ప్రారంభించినట్లు ఆమె భర్త కుల్దీప్ శుక్లా వెల్లడించారు.

కాగా, అప్పటికే ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దీంతో వెంటనే ఆ ఏర్పాట్లు నిలిపివేయాలని గ్రామస్థులను కోరారు. దీంతోపాటు వినితాను అటు నుంచి అటే తిరిగి ఆసుపత్రికి తరలించారు. అప్పుడు నిశితంగా పరిశీలించిన వైద్యులు ఆమె కాలిపై ఏదో గాయం ఉందని గుర్తించారు. ఏదైనా కీటకం / విషపూరిత సర్పం కరిచిందని అనుమానించారు. ఆ మేరకు దాదాపు 12 రోజులపాటు ఐసీయూలో చికిత్స అందించడంతో ఆమె పూర్తిగా కోలుకున్నారు.

Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
India T20 Semifinal | కరేబియన్​ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్​లోకి భారత్​
March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
TAGGED:ambulance miracle incidentbrain dead woman revivesindia strange newsmedical miracle casemiracle survival storyup viral newsuttar pradesh newsviral news india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Next Article Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత, సర్పంచి భర్త దారుణ హత్య! Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?