అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ameenpur Hydraa Demolitions | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. హైకోర్టు లాయర్ ముఖీం ఫామ్‌హౌస్‌ను అధికారులు కూల్చివేశారు.
గ్రామంలో కోర్టు పరిధిలో ఉన్న సుమారు 1,264 ఎకరాల భూమికి కబ్జాకు గురైందని హైడ్రా అధికారులు (Hydraa Officers) తెలిపారు. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. సుమారు రెండు ఎకరాల విస్తిర్ణంలో నిర్మించిన ముఖీం ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల బృందాలు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. 1998 నుంచి కోర్టు స్టే ఉన్న స్థలంలో నిర్మించి ముఖీం గెస్ట్‌హౌస్‌ను కూల్చివేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ముఖీం సోదరుడు అజీమ్ నిర్మించిన చెందిన ఆరు అంతస్తుల భారీ భవనాన్ని కూడా అధికారులు నేలమట్టం చేశారు. పేద నివాసితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, అక్రమ నిర్మాణాలపైనే తమ దృష్టి కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Ameenpur Hydraa Demolitions | రూ.15 వేల కోట్ల భూమి
ఐలాపూర్‌లో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 860 ఎకరాల భూమిని రక్షించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. దీని విలువ రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా.. అయితే కూల్చివేతలపై పలువురు భాధితులు హైకోర్టు (High Court) ఆశ్రయించారు. దీంతో కోర్టు హైడ్రా ఆపరేషన్‌పై స్టే ఇచ్చింది. దీంతో హైడ్రా అధికారులు ఐలాపూర్‌లో కూల్చివేతలు నిలిపివేశారు.
ఇది కూడా చదవండి..: Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
