అక్షరటుడే, వెబ్డెస్క్: Amit Shah Manifesto | పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ నాయకులు (BJP Leaders) తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ పార్టీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) విడుదల చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోగా చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ మేనిఫెస్టో (BJP Manifesto)లో పేర్కొంది. ప్రతి మహిళకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల సహాయం, రాష్ట్ర ఉద్యోగుల కోసం ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ ‘సంకల్ప పత్రం’ను ఆవిష్కరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ పత్రాన్ని ‘సోనార్ బంగ్లా’ను సృష్టించేందుకు ఒక మార్గసూచిగా అభివర్ణించారు.
Amit Shah Manifesto | మమత పాలన పీడకల
గత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన రాష్ట్ర ప్రజలకు ఒక “పీడకల”గా మారిందని షా ఆరోపించారు. బీజేపీ సంకల్ప పత్రం రైతులు, యువత, మహిళలకు మార్గనిర్దేశం చేస్తూ వారికి ఒక కొత్త దిశను చూపిస్తుందన్నారు. బెంగాల్ సంస్కృతి పట్ల గర్వపడే ప్రతి పౌరుడికి ఇది నూతన ఆశను అందిస్తుందని పేర్కొన్నారు. బెంగాల్‌లో పౌరులందరికీ ఒకే చట్టం ఉండేలా చూస్తామని తెలిపారు.
Amit Shah Manifesto | సరిహద్దులు సురక్షితం
రాష్ట్ర సరిహద్దులను సురక్షితం చేస్తామని, పశువుల అక్రమ రవాణాకు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. పోలీసు బలగంతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.బీజేపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని షా అన్నారు.
ఇది కూడా చదవండి..: Dhar Murder Case | నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
