అక్షరటుడే, వెబ్డెస్క్ : Amrabad Rehabilitation Support | అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. రిజర్వ్ పరిధిలోని గ్రామాలకు చెందిన గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించే చర్యలు ప్రారంభించామన్నారు.
అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం కోసం పలు గ్రామాలను ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే. వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. మొదటి దశలో నాలుగు గ్రామాల నుంచి మొత్తం 417 కుటుంబాలను ఈ పునరావాస పథకం పరిధిలోకి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 14 గిరిజన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
Amrabad Rehabilitation Support | సామాజిక పర్యావరణ సంస్కరణ
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమ్రాబాద్ అడవులలో జీవిస్తున్న గిరిజన సముదాయాల్లో అభివృద్ధిని తీసుకురావడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. అదే సమయంలో అటవీ వన్యప్రాణి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక సామాజిక-పర్యావరణ సంస్కరణ అన్నారు. గిరిజన కుటుంబాల స్వచ్ఛంద పునరావాసం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. అలాగే పులులతో సహా ఇతర వన్యప్రాణుల సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
Amrabad Rehabilitation Support | రెండు రకాలుగా పరిహారం
మొత్తం ప్రక్రియ గిరిజన కుటుంబాల ఆమోదం మేరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. వారి ఎంపిక మేరకు రెండు రకాల పునరావాస ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. 160 కుటుంబాలకు రూ. 15 లక్షల నగదు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బచారంలో ఆధునిక వసతులతో కూడిన ఇళ్లు, 5 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : Double Bedroom Houses | ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి పొంగులేటి

