అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amy Jones Pippa Cleary Marriage | మహిళా క్రికెట్ ప్రపంచంలో అరుదైన ప్రేమకథ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్ జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ (Amy Jones) , ఆస్ట్రేలియా పేసర్ పైపా క్లియరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఏప్రిల్ 4, 2026న జరిగిన వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియా (Social Media)లో పంచుకోవడంతో క్రీడా ప్రపంచంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. దేశ సరిహద్దులను దాటి ప్రేమలో పడిన ఈ జంట కథ చాలా ప్రత్యేకమైనది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరిచయమైన వీరి స్నేహం, తర్వాత ఆస్ట్రేలియాలోని డొమెస్టిక్ క్రికెట్ (Domestic Cricket) ద్వారా మరింత బలపడింది. ముఖ్యంగా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (Women’s Big Bash League)లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తరపున ఆడే సమయంలో వీరి మధ్య అనుబంధం మరింత గట్టిపడింది.
Amy Jones Pippa Cleary Marriage | మహిళా క్రికెటర్స్ పెళ్లి
అమీ జోన్స్ ఇంగ్లండ్ తరపున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడిన అనుభవం కలిగిన సీనియర్ క్రికెటర్. మరోవైపు పైపా క్లియరీ (Paipa Cleary) ఆస్ట్రేలియా డొమెస్టిక్ సర్క్యూట్‌లో 100కు పైగా టీ20 మ్యాచ్‌లు ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024 జూలైలో వీరి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అభిమానులు వీరి పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ చరిత్రలో మహిళా క్రికెటర్ల మధ్య వివాహాలు కొత్త విషయం కాదు. గతంలో నాట్ సీవర్ – కేథరిన్ బ్రంట్, అలాగే మరిజానె కాప్ – డేన్ వాన్ నీకెర్క్ వంటి జంటలు కూడా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు అమీ-పైపా తీసుకున్న నిర్ణయం కూడా క్రీడా ప్రపంచంలో సామాజిక మార్పులను ప్రతిబింబిస్తోంది.
Amy Jones Pippa Cleary Marriage | ఆహ్లాదకరంగా వివాహ వేడుక
ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వీరి వివాహ వేడుక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెల్లని దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మైదానంలో ప్రత్యర్థులుగా నిలిచిన వీరు, ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారడం అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోంది. అమీ జోన్స్ – పైపా క్లియరీల వివాహం క్రీడాకారుల వ్యక్తిగత స్వేచ్ఛకు, సమాజంలో పెరుగుతున్న ఆమోదానికి ప్రతీకగా నిలిచింది. క్రీడల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చని వారు చూపించారు. భవిష్యత్ తరానికి ఇది ఒక స్ఫూర్తిదాయక కథగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Zomato RCB CSK Controversy | ఆర్సీబీ, సీఎస్కే అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన జొమాటో
