అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్ గవర్నర్ C. V. Ananda Bose తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. కాగా, తన రాజీనామాకు గల స్పష్టమైన కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ananda Bose Resignation | కొత్తగా ఎవరంటే..
West Bengal గవర్నర్‌గా దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించిన ఆనంద బోస్ తన రాజీనామా పత్రాన్ని ఇటీవల కేంద్రానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆయన రాజీనామా వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా..? లేక రాజకీయ పరిణామాలు ఏమైనా ఉన్నాయనే దానిపై స్పష్టత రాలేదు. కానీ, రాజీనామా విషయాన్ని అధికారికంగా ప్రకటించక పోవడం వల్ల ఈ పరిణామంపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇక, కొత్తగా గవర్నర్ నియామకంపై సైతం చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం Tamil Nadu గవర్నర్‌గా ఉన్న R. N. Ravi ని వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర సర్కారు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ఆనంద బోస్ పలు కీలక పరిపాలనా నిర్ణయాల్లో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొన్నిసార్లు విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ రాజ్యాంగబద్ధమైన పదవీ బాధ్యతలను నిర్వర్తించారనే పేరు ఉంది.

