Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు

తాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు

ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. శనివారం సాయంత్రం 7 గంటలకు ఈవెంట్​ ప్రారంభం అవుతుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 1:52 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Anirudh Hyderabad Concert

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anirudh Hyderabad Concert | ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్​, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కాన్సర్ట్ (Music Concert) నేడు గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో యువత, అభిమానులు తరలి రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేగాకుండా గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium) సమీపంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Contents
  • Anirudh Hyderabad Concert | ట్రాఫిక్​ ఆంక్షలు
    • Anirudh Hyderabad Concert | ఇలా వెళ్లాలి

అనిరుధ్​ రవిచందర్​ యువ సంగీత దర్శకుడిగా (Young Music Director) క్రేజ్​ సంపాదించారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్​ అందించారు. ఆయనకు యువతలో మంచి క్రేజ్​ ఉంది. ఈ క్రమంలో నగరంలో మ్యూజిక్​ కాన్సర్ట్​ నిర్వహిస్తున్నారు. అనిరుధ్​ కెరీర్​ 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా టూర్​ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి ఈవెంట్​ హైదరాబాద్ (Hyderabad)​లో జరగనుంది. సాయంత్రం 7 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.

Anirudh Hyderabad Concert | ట్రాఫిక్​ ఆంక్షలు

అనిరుధ్​ ఈవెంట్​ పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్​ పోలీసులు చర్యలు చేపట్టారు. నేడు సాయంత్రం 4 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు. ఈ సమయంలో స్టేడియం పరిసరాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై పరిమితులు ఉంటాయి. గచ్చిబౌలి జంక్షన్, ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్, విప్రో సర్కిల్ వైపు వెళ్లే మార్గాల్లో దారి మళ్లింపులు అమలు చేస్తున్నారు.

Anirudh Hyderabad Concert | ఇలా వెళ్లాలి

ట్రాఫిక్​లో ఇరుక్కోకుండా వాహనదారులు ఈ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. గచ్చిబౌలి చౌరస్తా నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వారు.. నేరుగా వెళ్లడానికి అనుమతి లేదు. వారు ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్ వద్ద రైట్ టర్న్​ తీసుకోవాలి. అనంతరం విప్రో జంక్షన్​కు వెళ్లాలి. అక్కడి నుంచి గౌలిదొడ్డి, గోపన్​పల్లి తండా, నల్లగండ్ల మీదుగా వెళ్లొచ్చు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్​పల్లి తండా, క్యూసిటీ (Q City) ప్రాంతాల నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనదారులు సైతం ప్రత్యామ్నాయ మార్గంలో రావాలి. విప్రో జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ (ORR) జంక్షన్ వద్ద మలుపు తీసుకోవాలి. అనంతరం గచ్చిబౌలి ప్రధాన మార్గంలోకి ప్రవేశించాలి.

ఇది కూడా చదవండి..: Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు

Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
TAGGED:Anirudh Hyderabad ConcertGachibowli StadiumHyderabadMusic ConcertTraffic RestrictionsYoung Music Director
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Air India Flight Return Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం
Next Article Dhurandhar 2 Review Dhurandhar 2 Review | ధురంధర్ 2పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?