Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం

తెలంగాణఅంతర్జాతీయం

Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం

ఓ యువతి స్టార్టప్​ను నెలకొల్పి ఏడాదిలోనే దాని విలువను రూ.800 కోట్లకు చేర్చింది. అంజలి సర్దానా వ్యాపార రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 10:37 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Anjali Sardana Startup

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anjali Sardana Startup | ఆ యువతి తన కలలను సాకారం చేసుకుంది. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచేలా స్టార్టప్​ను నెలకొల్పి ఏడాదిలో దానిని రూ.800 కోట్లకు విస్తరించింది. 23 ఏళ్ల వయసులో ఏ పని చేయాలన్న యువత ఆలోచిస్తుంటారు. వ్యాపార రంగంలోకి దిగడానికి భయపడతారు. ఆమె మాత్రం ప్రాంటో అనే సంస్థను స్థాపించింది. అది నేడు లక్షలాది మందికి చేరువ కావడంతో వ్యాపారం రూ.800 కోట్లకు చేరింది.

Contents
  • Anjali Sardana Startup | అమెరికాలో చదువు
    • Anjali Sardana Startup | ప్రముఖ నగరాల్లో
      • Anjali Sardana Startup | ఎలా పని చేస్తుంది
        • Anjali Sardana Startup | రెండో సారి నిధుల సేకరణ

ప్రస్తుతం మెట్రో నగరాల్లో చాలా మంది దంపతులు ఉద్యోగాలు చేస్తుంటారు. సాఫ్ట్​వేర్​, ఇతర ప్రైవేట్​ కంపెనీల్లో కొలువు చేసే వారికి ఇంటి పని చేసుకోవడానికి వీలు ఉండదు. ఇలాంటి వారి కోసం అంజలి సర్దానా (Anjali Sardana) అనే యువతి ప్రాంటో అనే సంస్థను స్థాపించింది. గృహ సహాయ సేవల రంగంలో సేవలు అందించడం దీని లక్ష్యం.

Anjali Sardana Startup | అమెరికాలో చదువు

అంజలి అమెరికా (America)లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం (Georgetown University)లో చదువు పూర్తి చేశారు. అనంతరం పలు సంస్థల్లో పని చేశారు. 2025 ఏప్రిల్‌లో ప్రాంటోను ప్రారంభించారు. ఢిల్లీ గుర్గావ్​లోని ఒక్క చిన్న ఆఫీసులో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. వినియోగదారులకు సేవలు అందించేందుకు తొలిరోజుల్లో ఆమె నేలపైనే నిద్రించేవారు. ప్రస్తుతం ఆ సంస్థకు వినియోగదారులు పెరిగారు. దీంతో ఎపిక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్ వంటి సంస్థల నుంచి సుమారు రూ.200 కోట్ల నిధులను సేకరించింది. కంపెనీ విలువ 100 మిలియన్ల (రూ.830 కోట్ల)కు చేరింది.

Anjali Sardana Startup | ప్రముఖ నగరాల్లో

సంస్థ ప్రారంభించిన మొదట్లో తమకు రోజుకు కేవలం 170 బుకింగ్‌లు మాత్రమే వచ్చేవాని అంజలి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 18 వేలకు బుకింగ్‌లకు చేరుకున్నట్లు చెప్పారు. అప్పుడు తాము చాలా చిన్న స్థాయిలో ఉండేవాళ్లమని, ఇప్పుడు తమ దగ్గర 3 వేల మందికి పైగా శిక్షణ పొందిన కార్మికులు ఉన్నారని వెల్లడించారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా 10 ప్రధాన నగరాల్లో ఈ సంస్థ ప్రస్తుతం సేవలు అందిస్తుంది. మరిన్ని నగరాలకు సేవలు విస్తరించేందుకు ప్లాన్​ చేస్తోంది.

Anjali Sardana Startup | ఎలా పని చేస్తుంది

ఇంటిపనులకు వినియోగదారులను అనుసంధానించే ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రాంటో.. ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది, బాత్‌రూమ్ శుభ్రత, బట్టలు ఉతకడం లాంటి పనుల కోసం దీని ద్వారా పని మనుషులను బుక్​ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న 10 నిమిషాల్లోనే సహాయకులు ఇంటికి వస్తారు. దీంతో సంస్థకు ఆదరణ పెరిగింది. 23 ఏళ్ల వయసులోనే కంపెనీలో 40 శాతం వాటాతో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని అంజలి ఏలుతున్నారు.

Anjali Sardana Startup | రెండో సారి నిధుల సేకరణ

ప్రాంటో సంస్థ గత సంవత్సరం ఆగస్టులో జనరల్ క్యాటలిస్ట్ (General Catalyst) నేతృత్వంలో 11 మిలియన్ల డాలర్ల నిధులను సేకరించింది. తాజాగా రూ.200 కోట్లను సమీకరించింది. నిధుల సమీకరణతో సంస్థలో అంజలి వాట 40 శాతానికి తగ్గింది.

ఇది కూడా చదవండి..: Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!

Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?
TAGGED:AmericaAnjali SardanaAnjali Sardana StartupGeneral CatalystGeorgetown Universityhome services platformIndian startup successPronto startupwomen entrepreneur Indiayoung entrepreneur story
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​ KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
Next Article Hyderabad Gas Shortage Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?