Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..

అంతర్జాతీయం

Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్‌కు షాకిచ్చిన ట్రంప్..

కొత్తకొత్త ఏఐ టూల్స్‌తో ఐటీ కంపెనీలకు షాకుల మీద షాకులిస్తున్న ఆంథ్రోపిక్ సంస్థకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 5:11 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Anthropic Trump Dispute
Anthropic Trump Dispute

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anthropic Trump Dispute | ఆంథ్రోపిక్ అనేది అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కంపెనీ. ఇది క్లాడ్ అనే శక్తిమంతమైన ఏఐ మోడల్‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీని ఓపెన్ ఏఐ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో దాని కొత్త ఏఐ టూల్స్, ప్లగ్-ఇన్స్, మోడల్ అప్‌డేట్స్ భారీ సంచలనం సృష్టించాయి.

Contents
  • Anthropic Trump Dispute | యూఎస్ రక్షణ శాఖతో విభేదాలు..
    • Anthropic Trump Dispute | ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్

ఆంత్రోపిక్ (Anthropic) ఇటీవల అనేక ఏఐ ప్లగిన్‌లను ప్రారంభించింది. ఈ ఏఐ టూల్స్ సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్, ఆర్థిక సేవలలోని స్టాక్‌లపై అత్యధిక ప్రభావాన్ని చూపాయి. ఏఐ ప్రపంచంలో ఆంత్రోపిక్ క్లాడ్ చాట్‌బాట్ ప్రసిద్ధి చెందింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. ఈ క్లాడ్‌కోడ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. దాంతో కోడింగ్ ప్రాసెస్‌లోనే డెవలపర్లు భద్రతాపరమైన లోపాలను గుర్తించి, పరిష్కరించుకోవడానికి వీలు చిక్కుతుంది. అయితే ఈ ఏఐ ఆధారిత ఫీచర్ ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది.

Anthropic Trump Dispute | యూఎస్ రక్షణ శాఖతో విభేదాలు..

ఆంథ్రోపిక్ స్టార్టప్ కొత్త ఫీచర్లలో మిలిటరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. మిలిటరీ క్లాసిఫైడ్ సిస్టమ్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మోడల్ ఇది. దీనిని సున్నితమైన నిఘా, రక్షణ కోసం ఉపయోగించవచ్చు. ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన ఉపయోగాల కోసం ఏఐ మోడళ్లను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలని, యుద్ధాలు, గూఢచర్యానికి సంబంధించి ఏఐకి ఉన్న ‘సేఫ్టీ రూల్స్’ను తొలగించాలని ఆంథ్రోపిక్‌ను యూఎస్ రక్షణశాఖ (US Defense Department) కోరింది. అయితే వీటిని ఆంథ్రోపిక్ అంగీకరించలేదు. ఏఐ టూల్ క్లాడ్‌ను అమెరికన్లపై గూఢచర్యానికి, ప్రాణాంతక సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగించకూడదని పేర్కొంది.

Anthropic Trump Dispute | ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్

యూఎస్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భద్రతా చర్యలను విస్మరించే అవకాశం ఇవ్వబోమని కంపెనీ స్పష్టం చేసింది. అయితే అమెరికా రక్షణశాఖ డిమాండ్లకు నో చెప్పిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్‌తో వ్యాపారం చేయబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఆ టెక్నాలజీని వాడడం వెంటనే ఆపేయాలని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించారు. ఇదే సమయంలో ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ ఓపెన్ ఏఐతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ వెల్లడించారు. “అమెరికా రక్షణ శాఖతో నిన్న ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించడంపై మా మధ్య చర్చ జరిగింది. ఇరువర్గాలు అంగీకారానికి వచ్చిన పరిమితుల్లోనే ఏఐ మోడల్స్ పనిచేస్తాయని నిర్ధారించేందుకు సాంకేతికపరమైన విధానాలను ప్రవేశపెట్టనున్నాం” అని ఆల్టమన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. రేపటి నుంచి ట్రంప్‌ టారిఫ్‌లు నిలిపివేత

Air India Plane Accident | ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Iran Drone Attack | యూఎస్​ ఎంబసీపై ఇరాన్​ దాడి
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
TAGGED:AI policy controversyAnthropic AIartificial intelligence newsClaude AI modelDonald Trump newsOpenAI Pentagon dealSam Altman statementUS defense department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Banswada MLA Arrest Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..
Next Article Balkonda Minor Harassment Balkonda Minor Harassment | మైనర్​పై వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?