అక్షరటుడే, కమ్మర్పల్లి: Anti-Drug Awareness | మత్తుపదార్థాల కారణంగా జీవితాలు చిన్నాభిన్నమవుతాయని.. విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని ఎస్సై అనిల్ పేర్కొన్నారు. మండలంలోని హాసాకొత్తూర్ జిల్లా (Hasakottur District) పరిషత్ పాఠశాలలో సోమవారం మత్తుపదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Anti-Drug Awareness | ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా..
‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సై (SI Anil) మాట్లాడుతూ.. మత్తుపదార్థాల కారణంగా ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు పోలీసులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ‘యాంటీ డ్రగ్ కమిటీ’ని (Anti-Drug Committee) ఏర్పాటు చేశామన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు పాఠశాల లోపల, వెలుపల అనుమానాస్పద పరిస్థితులపై నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి రహిత గ్రామంగా హాసాకొత్తూరును తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్ అధికారులు..
