అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Police Special Leaves | ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఊరట కలిగించే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
AP Police Special Leaves | మానసిక ఒత్తిడి తగ్గించడానికి..
రాష్ట్రంలోని అన్ని ర్యాంకుల పోలీసు సిబ్బందికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నారు. కుటుంబంతో సమయం గడపడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ సెలవుల మంజూరు విషయంలో యూనిట్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల పనితీరు మెరుగుపడటానికి, వారి మానసిక ఒత్తిడి తగ్గించడానికి తాజా నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల పోలీసు శాఖలో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు ఇలాంటి సౌకర్యాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Laughing Boy Viral | ఒక్క నవ్వుతో ఓవర్ నైట్ వైరల్ లాఫింగ్ బాయ్.. నెట్టింట తెలంగాణ బాలుడి సంచలనం!
ఇది కూడా చదవండి: Pomegranate Peel Benefits | తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఇందులో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
