అక్షరటుడే, న్యూఢిల్లీ: April 01 Pre market Analysis | అమెరికా, ఇరాన్(Iran)లు చర్చలకు సిద్ధమవుతున్నాయన్న వార్తలతో గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ కనిపించింది. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లూ లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
April 01 Pre market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 3.83 శాతం, ఎస్ అండ్ పీ 2.91 శాతం లాభపడ్డాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.22 శాతం లాభంతో ఉంది.
April 01 Pre market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.57 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.52 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.48 శాతం లాభపడ్డాయి.
April 01 Pre market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 6.25 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 4.14 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.18 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.62 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.33 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.68 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్(Gap up)లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 21వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 11,163 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 23వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు(Net buyers)గా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 14,894 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.94 నుంచి 0.92 కు తగ్గింది.
- విక్స్ 4.05 శాతం పెరిగి 27.89 వద్ద ఉంది. ఇది గత నాలుగేళ్ల గరిష్ట స్థాయి. మార్కెట్‌లో ఉన్న భయాలను ఇది సూచిస్తోంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 94.77 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.71 డాలర్ల వద్ద ఉంది.
