Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 02 Pre Market Analysis | ట్రంప్ హెచ్చరికలతో నష్టాల్లో మార్కెట్లు.. భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 02 Pre Market Analysis | ట్రంప్ హెచ్చరికలతో నష్టాల్లో మార్కెట్లు.. భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

April 02 Pre Market Analysis | ట్రంప్ హెచ్చరికలతో నష్టాల్లో మార్కెట్లు.. భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. మన మార్కెట్లు సైతం భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 2, 2026 8:14 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
April 02 Pre Market Analysis
April 02 Pre Market Analysis

అక్షరటుడే, న్యూఢిల్లీ: April 02 Pre Market Analysis | ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో భయాలను పెంచింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి.

Contents
  • April 02 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 02 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిసినా.. గురువారం ఉదయం ఫ్యూచర్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

April 02 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

ఇరాన్‌తో యుద్ధం రెండు మూడు వారాల్లో ముగియవచ్చన్న ఆశలతో గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.16 శాతం, ఎస్ అండ్ పీ 0.72 శాతం లాభపడ్డాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.68 శాతం నష్టంతో ఉంది.

April 02 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.66 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.06 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.82 శాతం లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

ఇరాన్‌తో యుద్ధం రెండు మూడు వారాల్లో ముగియవచ్చన్న ఆశలతో గత సెషన్‌లో భారీగా పెరిగిన మార్కెట్లు.. ట్రంప్(Trump) ప్రసంగంతో ఢీలా పడ్డాయి. ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొనడంతో ఆందోళన నెలకొంది.

క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.

ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.68 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.61 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.97 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.78 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.35 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.16 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 2.24 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 22వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,331 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐ(DII)లు వరుసగా 24వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 7,171 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.92 నుంచి 0.83 కి తగ్గింది.
  • విక్స్ 3.02 శాతం తగ్గి 24.87 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.77 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 5.14 శాతం పెరిగి, 106.3 డాలర్ల వద్ద ఉంది.
Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
TAGGED:April 02 Pre Market Analysisasian marketscrude oil pricesGlobal Marketsiran tensionsnifty outlookPre Market AnalysisStock Market Crashstock news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Banana Empty Stomach Banana Empty Stomach | అరటిపండు అమృతమే.. కానీ ఖాళీ కడుపుతో తింటే విషమే!
Next Article April 02 Gold Rates April 02 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మళ్లీ జోష్!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?