Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 04 Gold Rates | భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం.. మళ్లీ ఎగసిప‌డుతున్న‌ బంగారం ధర.. శాంతించిన వెండి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 04 Gold Rates | భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం.. మళ్లీ ఎగసిప‌డుతున్న‌ బంగారం ధర.. శాంతించిన వెండి

బిజినెస్​తాజా వార్తలు

April 04 Gold Rates | భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం.. మళ్లీ ఎగసిప‌డుతున్న‌ బంగారం ధర.. శాంతించిన వెండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో బంగారం ధరలలో మళ్లీ పెరుగుదల క‌నిపిస్తుంది. ఏప్రిల్ 4న దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలో మాత్రం తగ్గుదల చూపింది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 4, 2026 8:42 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
April 04 Gold Rates
April 04 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 04 Gold Rates | గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో Silver Rates భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపడంతో, పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

గత నెలలో భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు మార్చి చివరి వారంలో నుంచి తిరిగి పుంజుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా శుక్రవారం ఒక్కరోజే తులం బంగారం ధర సుమారు రూ.2,000 వరకు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. ఇక ఏప్రిల్ 4, శనివారం నాటి ధరలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

April 04 Gold Rates | మ‌ళ్లీ పైపైకి..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,360గా న‌మోదైంది.
  • విజయవాడలో Vijaywada 24 క్యారెట్ల ధర రూ.1,50,940గా ఉండ‌గా, 22 క్యారెట్ల ధర రూ.1,38,360గా ట్రేడ్ అయింది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,51,090గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,510గా ట్రేడ్ అయింది.
  • ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,50,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,360గా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,51,100గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,510గా ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,50,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,360గా ట్రేడ్ అయింది.
  • April 04 Gold Rates | స్వల్పంగా తగ్గుదల..

ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో hyderabadకిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. ఇదే ధర చెన్నై, కేరళలో కూడా నమోదైంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,49,900గా ట్రేడ్ అవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్నంతకాలం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని భావిస్తున్నారు.

ముఖ్యంగా డాలర్ బలహీనత, యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణ భయాలు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. మొత్తానికి, ప్రస్తుతం బంగారం మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుండగా, వెండి మాత్రం కొంత స్థిరత్వం కోల్పోయినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఈ ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు

Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
Lok Sabha Seats Increase | కేంద్రం కీలక నిర్ణయం.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత
TAGGED:April 04 Gold Ratesbullion rates Indiadaily gold updatesgold market newsgold price Delhigold price India todayGold Rate Hyderabadsilver rates india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delhi Earthquake Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు
Next Article Artificial Mango Ripening Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?