అక్షరటుడే, హైదరాబాద్: April 05 Gold Rates | ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.
ఒక దశలో లక్షా 60 వేల మార్క్‌ను దాటిన బంగారం ధరలు Gold Rates ఇటీవల స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ పెరుగుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 5, 2026) దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930గా నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి కిలో ధర రూ.2,50,000గా ఉంది.
April 05 Gold Rates | ధరలు ఎందుకు మారుతున్నాయి?
ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350గా ఉంది. వెండి కిలో రూ.2,55,000 కాగా, విజయవాడ & విశాఖపట్నంలలో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,930గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350గా ట్రేడ్ అయింది. ఇక వెండి కిలో రూ.2,55,000 కాగా, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,51,080, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,500, వెండి కిలో రూ.2,50,000గా ఉంది.
ఇక ముంబైలో Mumbai 24 క్యారెట్ల బంగారం – రూ.1,50,930 కాగా, 22 క్యారెట్ల బంగారం – రూ.1,39,500, వెండి కిలో – రూ.2,50,000గా ట్రేడ్ అయింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం – రూ.1,52,180, 22 క్యారెట్ల బంగారం – రూ.1,39,500, వెండి కిలో – రూ.2,55,000గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం – రూ.1,50,930, 22 క్యారెట్ల బంగారం – రూ.1,38,350, వెండి కిలో – రూ.2,50,000గా ట్రేడ్ అయింది.
April 05 Gold Rates | మరింత పెరిగే అవకాశం!
బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, కరెన్సీ Currency మార్పిడి విలువలు, అలాగే రాష్ట్ర పన్నులు వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే నగరానికో ధర మార్పు కనిపిస్తుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగుతున్న దృష్ట్యా, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
