Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 05 Horoscope | స్టాక్ మార్కెట్లో జాక్‌పాట్.. ఆ రాశుల వారి ఆర్థిక కష్టాలకు ఎండ్ కార్డ్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - April 05 Horoscope | స్టాక్ మార్కెట్లో జాక్‌పాట్.. ఆ రాశుల వారి ఆర్థిక కష్టాలకు ఎండ్ కార్డ్!

భక్తితాజా వార్తలు

April 05 Horoscope | స్టాక్ మార్కెట్లో జాక్‌పాట్.. ఆ రాశుల వారి ఆర్థిక కష్టాలకు ఎండ్ కార్డ్!

Naresh chandan
Last updated: ఏప్రిల్ 5, 2026 5:30 ఉద.
Naresh chandan
1 రోజు ago
Share
April 05 Horoscope
April 05 Horoscope

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 05 Horoscope | ప్రస్తుత గ్రహ గతులను పరిశీలిస్తే.. బుధ గ్రహం మీన రాశిలో సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం, ఏప్రిల్​ 05) ద్వాదశ రాశుల వారిపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల కొందరికి వ్యాపారాల్లో ఊహించని మలుపులు ఎదురైతే, మరికొందరికి కమ్యూనికేషన్ లోపం వల్ల చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు.

Contents
  • April 05 Horoscope | రాశుల వారీగా..
    • April 05 Horoscope | వృషభం, మిథునం..
      • April 05 Horoscope | కర్కాటకం, సింహం..
      • April 05 Horoscope | కన్యా, తులా..
      • April 05 Horoscope | మిగతా రాశులు..

జాతక చక్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగం పడుతుండగా.. మరికొందరికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. మరి ఈ ఆదివారం ఎవరికి అదృష్టం తలుపు తట్టనుంది? ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో.. పూర్తి ఫలితాల్లో ఇప్పుడు చూద్దాం.

April 05 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు కొంచెం అలసటను, ఒత్తిడిని కలిగించినప్పటికీ.. ఆర్థికంగా మాత్రం లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి అనారోగ్యం మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం మంచిది.

April 05 Horoscope | వృషభం, మిథునం..

వృషభ రాశి: పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి, తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇంట్లో గొడవలు లేదా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయటకు వెళ్ళినప్పుడు ఊహించని పరిచయాలు ఏర్పడవచ్చు.

మిథున రాశి: గతంలో అనుకున్న కొన్ని ప్లాన్స్ ఇవాళ అమలవుతాయి. దీనివల్ల మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. భాగస్వామి ఒక అందమైన సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది. పని పట్ల మీకున్న అంకితభావం, పనులను పూర్తి చేసే వేగం మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి. చిన్న చిన్న మనస్పర్థల వల్ల బంధువులతో గొడవలు రావచ్చు.

April 05 Horoscope | కర్కాటకం, సింహం..

కర్కాటక రాశి: ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఇంట్లో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చే అవకాశం ఉంది. పని విషయంలో మీరు పడుతున్న కష్టానికి ఇవాళ తగిన ఫలితం లభిస్తుంది. మీ శ్రమ వృథా పోదు.

సింహ రాశి: వ్యాపారం చేసే వారికి ఇవాళ ప్రాణ స్నేహితుడి సహాయంతో డబ్బు అందుతుంది. ఈ ధన సహాయంతో చాలా కాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులు మీ మాటలకు ప్రాధాన్యం ఇస్తారు, మీ అభిప్రాయాలను సమర్థిస్తారు.

April 05 Horoscope | కన్యా, తులా..

కన్యా రాశి: స్నేహితులు అండగా నిలుస్తారు. వారి వల్ల మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువులు కొనడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బంది కలగవచ్చు. కానీ, ఆ వస్తువులు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ ప్రయాణాలు చేస్తుంటే, వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.

తులా రాశి: కుటుంబ సభ్యుల ఆశయాలకు అనుగుణంగా, బాధ్యతగా ఏదైనా పని ప్రారంభించడం మంచిది. అనుకోని లాభాలు లేదా షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా ధన లాభం చేకూరే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం లేదా గురువులను కలవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇవాళ చేసే ప్రయాణాలతో భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

April 05 Horoscope | మిగతా రాశులు..

వృశ్చిక రాశి: ఇవాళ యోగా లేదా ధ్యానంతో (Meditation) ప్రారంభించండి. పిల్లల ద్వారా ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది. ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీకున్న ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల కొత్త స్నేహితులు పరిచయమవుతారు. మీరు ఎదుర్కొంటున్న ఏదైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరించుకోవడంలో జీవిత భాగస్వామి అండగా నిలుస్తారు.

ధనుస్సు రాశి: గతంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే, వారు తిరిగి అడిగే అవకాశం ఉంది. ఆ డబ్బు చెల్లించడం వల్ల ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎంతో సంతోషం, ఉత్సాహం లభిస్తాయి. ఏదైనా తప్పుడు సమాచారం వల్ల చిన్నపాటి సమస్యలు రావచ్చు.

మకర రాశి: శారీరక, మానసిక , ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోండి. మీలో ఉన్న ఉత్సాహం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు లేదా టెన్షన్లు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పాత బాధలను, సమస్యలను మర్చిపోయి.. కొత్తగా, సృజనాత్మకంగా (Creative) ఆలోచించడానికి ప్రయత్నిస్తారు.

కుంభ రాశి: మానసిక ఒత్తిడి వల్ల చిన్నపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఇవాళ ఇంటికి అనుకోని అతిథి వచ్చే అవకాశం ఉంది. వారి రాక వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది లేదా ఏదైనా లాభం చేకూరుతుంది. గతంలో ఎవరికైనా చేసిన సహాయం ఇవాళ అందరి దృష్టికి వస్తుంది. దీనివల్ల మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.

మీన రాశి: ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు, స్నేహితుడు అండగా నిలిచి ఆ సమస్య నుంచి బయటపడేలా చేస్తారు. ఇంటి పనుల్లో లేదా ఇతర బాధ్యతల్లో కుటుంబం నుంచి ఆశించినంత సహాయం అందకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఇవాళ అనుకున్నంత సానుకూలత ఉండకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

ఇది కూడా చదవండి: Marriage Relationship | భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఆ చిన్న పొరపాటే.. చాణక్య నీతి ఏం చెబుతుందంటే!

Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Telangana Rain Alert | రెయిన్​ అలర్ట్​.. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..
TAGGED:April 05 Horoscopeastrology todayastrology updatesDaily horoscopehoroscope indialucky zodiac signsstar signs todayzodiac predictions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ Raghav Chadha | రాఘవ్ చడ్డా బీజేపీలో చేరబోతున్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ
Next Article Belly Fat Loss | పురుషుల్లో పెరుగుతున్న పొట్ట.. జిమ్‌కు వెళ్లకుండానే 30 రోజులలో తగ్గించుకోండిలా! Belly Fat Loss | పురుషుల్లో పెరుగుతున్న పొట్ట.. జిమ్‌కు వెళ్లకుండానే 30 రోజులలో తగ్గించుకోండిలా!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?