అక్షరటుడే, న్యూఢిల్లీ: April 06 Pre Market Analysis | హార్మూజ్‌ను తెరవకపోతే అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని, ఆ దేశానికి నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ఇరాన్‌ను బెదిరించిన నేపథ్యంలో ఆందోళనలు పెరుగుతున్నాయి.
క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ బ్యారెల్ కు 110 డాలర్లు దాటడం ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉండగా.. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో సాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
April 06 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.18 శాతం, ఎస్ అండ్ పీ 0.11 శాతం లాభపడ్డాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.17 శాతం లాభంతో ఉంది.
April 06 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.56 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.25 శాతం నష్టంతో ముగియగా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.69 శాతం లాభపడింది.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.18 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.62 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.32 శాతం లాభంతో ఉన్నాయి.
సెలవుల కారణంగా హాంకాంగ్, చైనా, తైవాన్ మార్కెట్లు మూసి ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 013 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు వరుసగా 23వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 9,931 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 25వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 7,208 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.93 నుంచి 1.09కు పెరిగింది.
- విక్స్ 2.04 శాతం పెరిగి 25.52 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1.68 రూపాయలు బలపడి 93.10 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.39 శాతం పెరిగి, 110.42 డాలర్ల వద్ద ఉంది.
- భారత దేశ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డాటా నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరింది.
ఇది కూడా చదవండి: April 06 Horoscope | ఈ రాశుల వారి టాలెంట్‌కు.. శత్రువులైనా సలాం కొట్టాల్సిందే!
