Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 08 Horoscope | జాబ్ ఆఫర్స్.. కొత్త బిజినెస్ డీల్స్.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - April 08 Horoscope | జాబ్ ఆఫర్స్.. కొత్త బిజినెస్ డీల్స్.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం!

భక్తితాజా వార్తలు

April 08 Horoscope | జాబ్ ఆఫర్స్.. కొత్త బిజినెస్ డీల్స్.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ఆధారంగా ఒక వ్యక్తి రాశికి వచ్చే ఫలితాల గురించి చెప్పే అంచనాలే రాశి ఫలాలు. జననం సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దానిని ఆధారంగా వ్యక్తికి ఒక రాశి (Zodiac Sign) ని నిర్ణయిస్తారు. ఆ రాశిపై గ్రహాల సంచార ప్రభావం ఎలా ఉందో చూసి ఫలితం ఎలా ఉండవచ్చో చెప్పే అంచనాలనే రాశి ఫలాలు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 7, 2026 11:54 సా.
Naresh chandan
21 గంటలు ago
Share
April 08 Horoscope
April 08 Horoscope

అక్షరటుడే, వెబ్​డెస్క్: April 08 Horoscope | గ్రహగతుల మార్పుతో రాశి చక్రం నేడు (బుధవారం, ఏప్రిల్​ 08) కొత్త మలుపు తిరుగుతోంది. గ్రహచలనం రీత్యా కొన్ని రాశుల వారికి కనక వర్షం కురిసే అవకాశం ఉండగా.. మరికొందరికి పనిలో సవాళ్లు ఎదురుకావచ్చు. ధన యోగం, ఆరోగ్య జాగ్రత్తలు, సంభాషణల్లో నిగ్రహం పాటించాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

Contents
  • April 08 Horoscope | రాశుల వారీగా..
    • April 08 Horoscope | వృషభం, మిథునం..
      • April 08 Horoscope | కర్కాటకం, సింహం..
      • April 08 Horoscope | కన్యా, తులా..
      • April 08 Horoscope | మిగతా రాశులు..

April 08 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: అనారోగ్యం నుంచి కోలుకుంటారు. అవసరమైన సమయంలో స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆఫీసులో మీ పని తీరు మెరుగుపడటంతో పాటు పదోన్నతి లేదా మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటానికి ఉదయాన్నే ‘ఓం హం హనుమతే నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో పఠించండి.

April 08 Horoscope | వృషభం, మిథునం..

వృషభ రాశి: కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరి ప్రవర్తనచిరాకు కలిగించవచ్చు. గతంలో పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు. సృజనాత్మక రంగంలో (Creative works) ఉన్నవారికి ఇవాళ కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు.

మిథున రాశి: ఆరోగ్యం బాగుంటుంది. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం గణపతిని ఆరాధించండి లేదా ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి.

April 08 Horoscope | కర్కాటకం, సింహం..

కర్కాటక రాశి: ఆరోగ్యం విషయంలో భాగస్వామి ఇచ్చే సలహాలను పాటించండి, అది మేలు చేస్తుంది. మీ కలలు నిజమయ్యే అవకాశం ఉంది. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఆలోచించకుండా చేసే పనుల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు.

సింహ రాశి: ఇవాళ ఎంతో సరదాగా, వినోదభరితంగా గడుస్తుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. దీనివల్ల ఊహించని విధంగా భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. సోదరుడు అండగా నిలుస్తారు. ఆశించిన దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది.

April 08 Horoscope | కన్యా, తులా..

కన్యా రాశి: గ్రహాల ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి జీవిత భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో చర్చించి సలహాలు తీసుకోండి. కొత్త ప్రాజెక్టులు లేదా భవిష్యత్తు ప్రణాళికలకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. తెలిసిన మహిళల ద్వారా కొత్త ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. డబ్బు ఇబ్బందులు తగ్గి, ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే.. ప్రతిరోజు ఉదయాన్నే ‘ఓం హం హనుమతే నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించండి.

తులా రాశి: ఇవాళ ఆశించిన స్థాయిలో ధనలాభాలు ఉండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత నిలకడ అవసరం. ప్రారంభించబోయే కొత్త పథకాలు లేదా వ్యాపారాల పట్ల భాగస్వాములు (Partners) చాలా ఆసక్తిగా ఉంటారు. వారి మద్దతు లభిస్తుంది.

April 08 Horoscope | మిగతా రాశులు..

వృశ్చిక రాశి: ఇవాళ శారీరకంగా, మానసికగా కొంత బలహీనంగా అనిపించవచ్చు. వ్యాపారస్తులకు తమ ప్రాణ స్నేహితుడి సహాయంతో ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేదంటే వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు.

ధనుస్సు రాశి: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు లేదా రావాల్సిన డబ్బు ఎట్టకేలకు చేతికి అందుతుంది. ఇది పెద్ద ఊరటనిస్తుంది. స్నేహితులు అండగా నిలుస్తారు. వారితో మాట్లాడేటప్పుడు మాట జారకుండా జాగ్రత్త వహించండి.

మకర రాశి: భవిష్యత్తు అవసరాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. మీలోని కళాత్మక దృష్టికి, కొత్త ఆలోచనలకు (Creativity) మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా ప్రశంసలు లేదా బహుమతులు వచ్చే అవకాశం ఉంది.

కుంభ రాశి: ధన లాభం ఉంటుంది, కానీ ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. సోదరీమణుల నుంచి పూర్తి మద్దతు లభిస్తాయి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్నేహితుడు అండగా నిలిచి ఓదారుస్తారు. కళలు, రంగస్థలం లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి.

మీన రాశి: ఇతరులకు చిన్న చిన్న సహాయాలు చేయడం వల్ల ఎంతో తృప్తి లభిస్తుంది. ఆఫీసులో గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు ఈరోజుతో తొలగిపోయే అవకాశం ఉంది. పని వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఆదాయ మార్గాలు పెరగడానికి ప్రతిరోజు ‘ఓం గం గణపతయే నమః’ (లేదా శం గం గణపతయే నమః) అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో పఠించండి.

March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
KA Paul Iran Israel War | వారంలో యుద్ధం ముగుస్తుంది : కేఏ పాల్
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
TAGGED:April 08 Horoscopeastrological forecastastrology todaydaily astrologyDaily horoscopehoroscope 2026rashifal todayzodiac predictions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bushehr Nuclear Tension Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు
Next Article Iran Ceasefire Deal Iran Ceasefire Deal | ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత.. రెండు వారాల కాలపరిమితి ప్రకటించిన ట్రంప్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?