Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 2026 Money Rules | మనీ రూల్స్‌లో మెనీ చేంజెస్.. ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులివే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - April 2026 Money Rules | మనీ రూల్స్‌లో మెనీ చేంజెస్.. ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులివే!

జాతీయంబిజినెస్​

April 2026 Money Rules | మనీ రూల్స్‌లో మెనీ చేంజెస్.. ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులివే!

కొత్త ఆర్థిక సంవత్సరం రేపటినుంచి ప్రారంభం కానుంది. బ్యాంకులు తమ సేవలకు సంబంధించి పలు మార్పులను అమలులోకి తేబోతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 1:27 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
April 2026 Money Rules

అక్షరటుడే, వెబ్​డెస్క్: April 2026 Money Rules | ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి (2026-27) అడుగుపెట్టబోతున్నాం. ఈ సమయంలో ఆర్థిక సంబంధమైన పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Contents
  • April 2026 Money Rules | నలుగురు నామినీలకు అవకాశం..
    • April 2026 Money Rules | ప్రీపేమెంట్ చార్జీలు సున్నా..

ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలు చేయబోతోంది. కస్టమర్లకు మేలు చేసేలా, పారదర్శకత పెంచేలా ఈ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులేవో తెలుసుకుందామా..

April 2026 Money Rules | నలుగురు నామినీలకు అవకాశం..

బ్యాంకు ఖాతాలు, లాకర్లకు ఇప్పటివరకు గరిష్టంగా ఇద్దరు నామినీలను మాత్రమే చేర్చుకునే అవకాశం ఉంది. దీనిని నాలుగుకు పెంచారు.

గోల్డ్ లోన్ గడువు పెంపు గోల్డ్ మెటల్ లోన్ రీపేమెంట్ గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచారు. ఇది వ్యాపారులకు ఊరట కలిగించే విషయం.

April 2026 Money Rules | ప్రీపేమెంట్ చార్జీలు సున్నా..

ఫ్లోటింగ్ రేటు ఉన్న హోమ్, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్లను ముందుగానే చెల్లిస్తే ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. బ్యాంకు రుణాలను త్వరగా తీర్చేయాలనుకుంటున్నవారికి ఊరట లభించే నిర్ణయమిది.

April 2026 Money Rules | వారానికోసారి సిబిల్ స్కోర్ అప్‌డేట్..

ప్రస్తుతం నెలకు ఒకసారి మాత్రమే సిబిల్ స్కోర్ అప్ డేట్ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ గడువును వారానికి కుదించారు. ఇకపై ప్రతినెలా 7, 14, 21, 28 తేదీల్లో అప్ డేట్ అవుతుంది. అప్పు చెల్లిస్తే వెంటనే ప్రభావం కనిపిస్తుందన్నమాట.. క్రెడిట్ స్కోర్ త్వరగా అప్‌డేట్ అవడంతో మంచి స్కోర్ ఉన్నవారు వెంటనే తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు పొందే అవకాశం చిక్కుతుంది.

నగదు విత్‌డ్రా పరిమితి కుదింపు..

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రోజువారీ ఏటీఎం (ATM) నగదు విత్‌డ్రా లిమిట్స్ మారాయి. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై విత్‌డ్రా పరిమితిని 50 శాతానికి తగ్గించారు.

రూ. 10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరి..

ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదును ఒకేసారి జమ చేసినా లేదా విడతల వారీగా జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక రోజులో రూ. 50 వేలు దాటితే పాన్ వివరాలు అడుగుతున్నారు.

బ్యాంక్ సేవా రుసుముల భారం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం నుంచిి నగదు ఉపసంహరణ పరిమితులు దాటితే వసూలు చేసే చార్జీలు, బ్యాంక్ లాకర్ ఫీజులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు అమలులోకి రానున్నాయి.

2 ఫ్యాక్టర్ అథెంటికేషన్..

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్లలో భద్రతను పెంచింది. ఇప్పటివరకు ఓటీపీ మాత్రమే వచ్చేది. కానీ ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు మరొక అదనపు భద్రతా ఫీచర్ (బయోమెట్రిక్ లేదా యాప్ అప్రూవల్ వంటివి) తప్పనిసరి కానున్నాయి. ఇది లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
TAGGED:April 2026 Money RulesATM withdrawal limitCIBIL score updatefinancial year 2026-27HDFC BankIndia banking changes 2026loan prepayment rulesPAN rules IndiaRBI new rulesReserve Bank of India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bike Stunt Case Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Next Article Assam BJP Manifesto Assam BJP Manifesto | ప్రతి కుటుంబానికి ఇల్లు.. మహిళలకు నెలకు రూ.3వేలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Lava Bold N2 Pro | బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?