అక్షరటుడే, ఆర్మూర్: AR Constable Complaint | ఏఆర్ కానిస్టేబుల్‌పై నందిపేట్ మండల లక్కంపల్లి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్యకు (CP Sai Chaitanya) మంగళవారం ఫిర్యాదు కాపీని అందజేశారు.
AR Constable Complaint | ఏఆర్ కానిస్టేబుల్..
ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్‌రావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు. గ్రామంలో తగాదాలు సృష్టిస్తున్నాడని వారు వివరించారు. గతంలో సదరు కానిస్టేబుల్‌పై పలు కేసులు సైతం ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీని కలిసిన వారిలో లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..:Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్‌లు బంద్: సీపీ సాయిచైతన్య

