Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య

ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్​ నగరంలోని ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 10:17 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
AR Constable Murder

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Contents
  • AR Constable Murder | కత్తితో దాడి
    • AR Constable Murder | పరారీలో నిందితుడు

ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లోని కర్నూల్‌ జిల్లాకు చెందిన సుధీర్‌(35) చెంగిచర్లలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్​గా విదులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఉప్పల్​ పరిధిలోని చిలుకానగర్‌ (Chilukanagar)లో ఉండే ఆటోడ్రైవర్‌ సంతోష్‌నాయక్‌తో స్నేహం ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఆదివారం రాత్రి వాట్సాప్​ చాటింగ్​ జరిగింది. ఈ చాటింగ్​లో ఇద్దరు గొడవ పడ్డారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు.

AR Constable Murder | కత్తితో దాడి

వాట్సాప్​ చాటింగ్​ (WhatsApp Chatting)లో గొడవ తర్వాత ఆదివారం రాత్రి చిలుకానగర్‌ ప్రాంతంలోని ఆదర్శనగర్‌లో ఉన్న ఖాళీ స్థలం వద్ద సుధీర్​, సంతోష్​నాయక్​ కలుసుకున్నారు. సంతోష్​నాయక్​ ముందుగానే అక్కడకు వెళ్లగా.. కానిస్టేబుల్ సుధీర్​ మరో స్నేహితుడు ఇమ్రాన్​ఖాన్​తో అక్కడకు వచ్చాడు. వారు రాగానే సంతోష్​ నాయక్​ కతత్తితో సుధీర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సుధీర్, ఇమ్రాన్‌ఖాన్‌ భయంతో పరుగులు తీశారు. అనంతరం ఆదర్శనగర్‌ సాయిబాబా ఆలయ (Adarshnagar Sai Baba Temple) ప్రాంతంలో సుధీర్‌ పడిపోయి మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

AR Constable Murder | పరారీలో నిందితుడు

సంతోష్ నాయక్ సుధీర్ కుమార్​ను కడుపు, మెడ భాగాల్లో కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆయన మృతి చెందాడు. అనంతరం నిందితుడు పరారు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు

Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
Encroachment Removal Orders | ఆక్రమణలు తొలగించాలి.. హైడ్రా కమిషనర్​ ఆదేశం
TAGGED:Adarshnagar Sai Baba TempleAndhra PradeshAR Constable MurderHyderabadWhatsApp Chatting
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article SCB Hospital Fire SCB Hospital Fire | కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలోని 10 మంది రోగులు మృతి
Next Article Gas Cylinder Shortage Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?