అక్షరటుడే, ఆర్మూర్: Armoor Peace Rally | ఈస్టర్ పండుగను (Easter celebrations) పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో(Armoor Municipality) పీస్ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ (Pastors association) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని సీఎస్ఐ చర్చి నుంచి జెండా ఊపి ప్రారంభించారు.
Armoor Peace Rally | అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు..
అనంతరం వందలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు (Christian community) అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మామిడిపల్లి చౌరస్తా మీదుగా సక్కి హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ.. క్రీస్తు పునరుత్థాన శాంతి (Telangana news) సందేశాన్ని అందించేందుకు (Local news India) క్రైస్తవులు తరలిరావడం అభినందనీయమన్నారు. క్రీస్తు ప్రేమ వార్తను ప్రకటిస్తూ ఆయన చూపిన శాంతి మార్గాన్ని అవలంభించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన సఖి హాస్పిటల్ రాజును అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజ్‌పాల్ దినకర్, కోశాధికారి మధు, కార్యవర్గ సభ్యులు ఇమ్మానుయేలు, కృప సత్యం, డేవిడ్, దైవ చిత్తం, హెప్సీబా, అగస్టీన్, శ్రీనివాస్, ఆనంద్ పాల్, ప్రభుదాస్, సునీల్, ప్రసాద్, జాన్ పీటర్, పరిమల్ రాజ్, జీజీరాం, రాజు తదితరులు పాల్గొన్నారు.
