అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | ఆపరేషన్‌లో భాగంగా కాలి వేలు తీసేస్తారనే భయంతో ఓ వ్యక్తి ప్రాణం (tragic incident) తీసుకున్నాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో (Armoor Municipality) శనివారం చోటు చేసుకుంది.
Armoor Police | ఆర్మూర్ పట్టణంలో..
ఆర్మూర్(Armoor) ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ కథనం ప్రకారం.. భీమ్‌గల్ (Bheemgal) మండలం చేంగల్ గ్రామానికి చెందిన రాజేశ్వర్(51) గీత కార్మికుడు. అయితే అతడి కుడిపాదానికి ఇన్ఫెక్షన్ కాగా ఈనెల 24వ తేదీన ఆర్మూర్‌లోని ఎంజే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కాగా డాక్టర్లు అతడిని పరీక్షించి కుడికాలు వేలు తీసివేయాలని చెప్పారు. దీంతో అప్పటినుంచి రాజేశ్వర్ భయపడుతూనే ఉన్నాడు. ఈనెల 27న ఉదయం ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి ఆస్పత్రి వెనక ఉన్న విశ్వబ్రాహ్మణ గుడి పక్కన ఖాళీ స్థలంలోని తుమ్మచెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతడి కుటుంబ సభ్యుల (Telangana crime) ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు (police investigation) చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


