అక్షరటుడే, ఆర్మూర్: Armur Municipal Protest | ఎన్నికల విధులు నిర్వహించిన కార్మికులకు డబ్బులు చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం విధులు బహిష్కరించారు. అనంతరం మున్సిపల్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
Armur Municipal Protest | మున్సిపల్ ఎన్నికల్లో..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) నెలరోజుల పాటు విధులు నిర్వహించిన కార్మికులకు ఒక్క రూపాయి చెల్లించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మరోవైపు ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం కేవలం పది రోజులు డబ్బులు మాత్రమే చెల్లించారన్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు కొందరు వారం రోజులు మాత్రమే ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ సదరు ఉద్యోగులకు ఎన్నికల కోడ్ ప్రారంభమైన నుంచి మొదలుకొని కోడ్ ముగిసే వరకు మొత్తం 45రోజుల డబ్బులు చెల్లించడం గమనార్హం.

Armur Municipal Protest | డబ్బులు చెల్లించాలని డిమాండ్..
దీంతో ఎన్నికల విధులు నిర్వహించిన వారందరికీ డబ్బులు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్లతో కార్మికుల వాగ్వాదానికి దిగారు. డబ్బులు చెల్లించే వరకు విధులు నిర్వహించమంటూ ఆందోళన చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Student Snake Bite | పదో తరగతి విద్యార్థికి పాముకాటు.. భయాందోళనలో విద్యార్థులు

