అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. బకాయిలను తాము పెండింగ్‌లో పెట్టలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలే ఉన్నాయని చెప్పారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆరోగ్య శ్రీ పథకం పై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ బిల్లులు విడుదల కావడం లేదన్నారు. బిల్లులు ఇవ్వకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రులు మేజర్ సర్జరీలకు చికిత్స చేయడం లేదన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినా.. 496 మంది మాత్రమే లబ్ధి పొందారన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని ఆస్పత్రులు నోటీసులు ఇచ్చినా బిల్లులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
Arogyasri Dues Release | ప్రతి నెలా రూ.90 కోట్లు
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Aarogyasri) కింద నెలకు రూ.90 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. పేమెంట్స్ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.627 కోట్ల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చాయన్నారు. అందులో రూ.240 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, రూ.360 కోట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు బాకీ ఉన్నట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చినప్పట నుంచి రూ.927 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు.. రూ.1,480 కోట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించామని తెలిపారు.
Arogyasri Dues Release | సీఎంఆర్ఎఫ్లో అవినీతి
రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ సహాయంలో అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీకి ఎవరైనా దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. 27 నెలల్లో రూ.2,046 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ

