అక్షరటుడే, కామారెడ్డి : Artificial Intelligence Courses | కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సులతో పాటు నూతన కోర్సులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. కామారెడ్డి మున్సిపల్ (Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో శ్రీనిధి, మంజీర డిగ్రీ కళాశాలల వారికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
Artificial Intelligence Courses | విద్యార్థుల నైపుణ్యం అద్భుతం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ బకాయిలు ఏప్రిల్, మే లోపు బకాయిలు పూర్తి కానున్నాయన్నారు. బకాయిలతో విద్యార్ధులకు ఇబ్బందులకు కలగవద్దని ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులు మాత్రమే కాకుండా నూతన కోర్సులు తీసుకురావాలని, సంబంధిత అనుమతులు కావాలంటే తాను ఇప్పిస్తానని తెలిపారు. కొత్త టెక్నాలజీతో విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యూనివర్సిటీ (University) కంటే మంచి ఫలితాలు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా అవగాహన కల్పించాలని, వారంలో రెండు రోజులు క్రీడలకు కూడా విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు తెలంగాణలో (Telangana) కామారెడ్డికి మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాలల ఛైర్మన్ గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు రాజు, సత్యనారాయణ, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, ఇతర సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్ డ్రైవ్ కేసులు..: సీపీ సాయిచైతన్య
