Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​

జాతీయంఆంధ్రప్రదేశ్​తాజా వార్తలుతెలంగాణ

Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​

హైదరాబాద్ నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నాంపల్లి-కన్యా కుమారి(07229/07230) వీక్లీ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ను ఇకపై రెగ్యులర్ (17069/17070). సర్వీస్ గా నడపనున్నట్లు ప్రకటించింది.

Naresh chandan
Last updated: మార్చి 1, 2026 11:40 సా.
Naresh chandan
4 వారాలు ago
Share
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​

అక్షరటుడే, హైదరాబాద్​: Arunachalam Train Services | హైదరాబాద్ నుంచి తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. భక్తుల రద్దీ, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని వారాంతపు రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడంతో పాటు మరికొన్ని రైళ్లను రోజువారీగా నడపనున్నట్లు వెల్లడించింది.

Arunachalam Train Services | భక్తుల సౌకర్యార్థం

ఇప్పటివరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న నాంపల్లి–కన్యాకుమారి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (07229 / 07230)ను ఇకపై రెగ్యులర్ (17069 / 17070)గా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పుతో అరుణాచలం సహా దక్షిణ భారతంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రయాణించే భక్తులకు మరింత సౌకర్యం ఏర్పడనుంది. ముఖ్యంగా కార్తీక దీపోత్సవం, పౌర్ణమి గిరిప్రదక్షిణ వంటి వేడుకల సమయంలో భారీగా వచ్చే భక్తులకు ఇది సౌకర్యవంతంగా ఉండనుంది.

ఇక కాచిగూడ–మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17615/17616)ను ఇకపై ప్రతిరోజు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికితోడు ఈ రైలును తూత్తుకుడి వరకు కూడా పొడిగించారు. తద్వారా తమిళనాడు, దక్షిణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా మారనుంది.

తాజా నిర్ణయంతో తెలంగాణ నుంచి తమిళనాడుకు వెళ్లే పర్యాటకులు, భక్తులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. రైళ్ల సంఖ్య పెరగడం వల్ల టికెట్ల కోసం పోటీపడే సమస్య తగ్గి, నిరీక్షణ జాబితా సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవకాశం ఉందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే శాఖ త్వరలోనే పూర్తి షెడ్యూల్, స్టాపేజీలు, టైమింగ్స్ వివరాలను ప్రకటించనుంది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా సమీప రైల్వే స్టేషన్ ద్వారా తాజా సమాచారాన్ని పొందాలని రైల్వే అధికారులు సూచించారు.

Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!
Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు
TAGGED:daily train servicesHyderabad to Arunachalam trainIndian Railways newsKacheguda Madurai ExpressNampally Kanyakumari ExpressSouth India railway updateTamil Nadu pilgrimage travelTiruvannamalai travel update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం Khamenei Death Protests | ఖమేనీ హత్యపై భారత్‌లో నిరసనలు.. ప్రధాని మోడీ కీలక సమావేశం
Next Article Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం! Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?