అక్షరటుటే, నిజామాబాద్ అర్బన్: Arvind Comments on BRS | లీడర్.. క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్‌లో మాట్లాడారు.
Arvind Comments on BRS | బీఆర్ఎస్ అంటే కరప్షన్.. డ్రగ్స్..
ఎంపీ మాట్లాడుతూ.. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, బీeర్ఎస్ పార్టీ అంతమైపోయిందన్నారు. బీఆర్ఎస్ (BRS Telangana) అంటే కరప్షన్, డ్రగ్స్ అని వాళ్లతో బీజేపీ పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కాంగ్రెస్‌పై కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మాట్లాడట్లేదని ఆరోపించారు.
Arvind Comments on BRS | త్వరలో బీజేపీలోకి వలసలు
కులాల వారీగా ప్రజలను విడదీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని ఆరోపించారు. బీజేపీని దెబ్బతీసేందుకు రహస్య ప్రణాళికలు చేస్తున్నారన్నారని.. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీ వలసలు ఖాయమని ఎంపీ జోస్యం చెప్పారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన లెక్క ప్రకారం తొందరపడ్డారని.. సంజయ్ కుమార్ మళ్లీ బీఆర్ఎస్లో యాక్టివ్ అయితే జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.
