అక్షరటుడే, ఇందూరు: Arya Vysya Swearing Ceremony | నగరంలోని(Nizamabad) శ్రీవాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం (Sri Vasavi Greater Arya Vysya Association) కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గోకుల్ గోసేవా ఆధ్వర్యంలో వినాయక్‌నగర్‌లోని(Vinayak Nagar) వాసవి స్పేస్ స్కూల్లో (Vasavi Space School) ఈ కార్యక్రమం జరిగింది.
Arya Vysya Swearing Ceremony | సంఘం అభివృద్ధికి కృషి..
సంఘం అధ్యక్షుడిగా పురుషోత్తం గుప్తా, ప్రధాన కార్యదర్శిగా చెన్న వివేకానంద్ గుప్తా, కోశాధికారిగా మార నిరీష్(ప్రభు) గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు గోపూజ నిర్వహించారు. అ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఐక్యతకు, సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆర్యవైశ్యులందరిని కలుపుకుని వెళ్తామని.. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ameenpur HYDRAA demolitions | అమీన్పూర్లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్
