Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు

సినిమాజాతీయం

Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు

దశాబ్దాల పాటు తన గానంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఆశా భోస్లే (92) ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 1:20 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Asha Bhosle Death

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asha Bhosle Death | భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గాయని ఆశా భోస్లే (Asha Bhosle) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రి (Breach Candy Hospital)లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.

Contents
  • Asha Bhosle Death | 12 వేల‌కి పైగా పాటలు..
    • Asha Bhosle Death | అనేక పురస్కారాలు

ఆశా భోస్లే ఛాతిలో ఇన్ఫెక్షన్, తీవ్రమైన అలసట కారణంగా శనివారం ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందించినప్పటికీ, ఆమెను కాపాడలేకపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా సినీ, సంగీత రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Asha Bhosle Death | 12 వేల‌కి పైగా పాటలు..

సుమారు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఆశా భోస్లే 20కి పైగా భాషల్లో 12 వేలకుపైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె గాన వైవిధ్యం, శైలీ ప్రత్యేకత భారతీయ సంగీతానికి కొత్త దారులు చూపించింది. మెలోడీ పాటల నుంచి పెప్పీ నంబర్స్ వరకు, గజల్స్ నుంచి భజనల వరకు ప్రతి జానర్‌లో తనదైన ముద్ర వేసి అపారమైన అభిమానాన్ని సంపాదించారు. ఆమె సోదరి, గానకోకిల (Lata Mangeshkar)తో కలిసి భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసిన వారిలో ఆశా భోస్లే ఒకరు. తన ప్రతిభతో, కృషితో అనేక తరాల గాయకులకు ఆదర్శంగా నిలిచారు.

Asha Bhosle Death | అనేక పురస్కారాలు

సంగీత రంగానికి ఆమె చేసిన అపూర్వ సేవలకు గాను భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించింది. ఆమె గానం కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఆశా భోస్లే మరణంపై దేశ ప్రధాని సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు Music Directors తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమె పాటలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Diesel Export Duty | కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్​ ఎగుమతులపై సుంకం పెంపు

Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్
Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం
Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
TAGGED:Asha Bhosle deathBollywood music legendIndian music industryIndian singer newsLata Mangeshkar sisterlegendary singers IndiaMumbai newsplayback singer legacy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Shanti Suspension Case Shanti Suspension Case | దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి సస్పెన్షన్
Next Article Paddy Procurement MSP | Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?