అక్షరటుడే, వెబ్డెస్క్ : Assam Uniform Civil Code | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అస్సాం (Assam)లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హామీ ఇచ్చారు. ఆరో షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణ కల్పిస్తామన్నారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా గోఘాముఖ్‌లో ప్రధాని మోదీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అస్సాం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. శించారు. అస్సాంలో చొరబాట్లను ఆ పార్టీ ప్రోత్సహించిందన్నారు.
అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రచారంలో దూసుకు పోతుంది. ఇందులో భాగంగా మోదీ సైతం ర్యాలీలు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. మోదీ మాట్లాడుతూ.. అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, చొరబాటుదారులకు రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని తీసుకువస్తుందని ఆరోపించారు.
Assam Uniform Civil Code | విభజించడానికి యత్నం
దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మోదీ ఆరోపించారు. మెజారిటీ వర్గాన్ని మైనారిటీగా మార్చి, చొరబాటుదారుల శాశ్వత ఓటు బ్యాంకును సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. చొరబాటుదారులను రక్షించడానికి అస్సాంలో కొత్త చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ (Congress) నాయకులు బహిరంగంగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పదేళ్ల పాలనలో ‘సేవ’ ‘సుపరిపాలన’ కొత్త శకానికి నాంది పలికిందన్నారు.
Assam Uniform Civil Code | రాహుల్‌పై విమర్శ
అస్సాం ఎన్నికల్లో బీజేపీ (BJP) హ్యాట్రిక్ సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో వంద ఓటములను చవిచూస్తుందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఆయనను “కాంగ్రెస్ స్వీయ-ప్రకటిత యువరాజు” అని అభివర్ణించారు. ఆయనకు వందో ఓటమి తప్పదని పేర్కొన్నారు.
Assam Uniform Civil Code | ఉపాధి అవకాశాలు
బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని వివరించారు. యువతకు భారీ ఎత్తున ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అస్సాంలో ఇప్పటికే 22 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయని మోదీ తెలిపారు. అదనంగా మరో 15 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను సమకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు కిండర్‌గార్టెన్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచిత విద్యను అందించే దిశగా కృషి చేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: New Income Tax Rules | అమలులోకి కొత్త ఐటీ రూల్స్.. మీ టేక్ హోమ్ శాలరీపై ప్రభావమెంత?
