అక్షరటుడే, వెబ్డెస్క్: Assembly Election Schedule | దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నాలుగు రాష్టాల ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు.
Assembly Election Schedule | ఐదు రాష్ట్రాల ఎలక్షన్కూ షెడ్యూల్
దేశంలో ఐదు రాష్ట్రాల ప్రభుత్వాల గడువు ముగియనుంది. నాలుగు రాష్ట్రాలకు సంబంధించి మేలో గడువు ముగియనుండగా.. ఒక రాష్ట్రానికి జూన్లో ముగియనుంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్ల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలిపి 17.4 కోట్ల మంది పాల్గొననున్నారు. మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 లక్షల మంది ఎన్నికల అధికారులను నియమించారు. మొత్తం అసెంబ్లీ 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 6 కోట్ల 44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
వివిధ దశల్లో ఎన్నికలు
అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే దశలో జరగనున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మే 4న కౌంటింగ్ జరుగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 23 తొలిదశ, ఏప్రిల్ 29 రెండు దశ పోలింగ్ జరుగనుంది.
Assembly Election Schedule | పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 2011 నుంచి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికారంలో ఉంది. కాగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగా.. ఈ సారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగే ఈ పోటీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పే అవకాశం ఉంది.
Assembly Election Schedule | అస్సాంలో 126 సీట్లు
అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరోసారి అధికారం కాపాడుకునే దిశగా ముందుకు సాగుతోంది. బీజీపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంతో దిగుతోంది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను ఎలా మార్చబోతాయో ఆసక్తికరంగా ఉంది.
కేరళ 140 సీట్లు
కేరళలో 140 సీట్లతో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధికార ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సుమారు 100 సీట్లలో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. బీడీజేఎస్, వివిధ మిత్ర పక్షాలు పోటీ చేయనున్నాయి. ఇలా కేరళ రాజకీయాల్లో త్రిముఖ పోటీ జరుగనుంది.

తమిళనాడులో 234 సీట్లు
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. అధికార డీఎంకే గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇక బీజేపీతో కలిసి అన్నాడీఎంకే రంగంలోకి దిగనుంది. విజయ్ టీవీకే పార్టీ స్థాపించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
పుడుచ్చేరీలోని 30 నియోజకవర్గాల్లో..
పుడుచ్చేరీలోని 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకే, సీపీఐలతో కలిసి ఒక కూటమిగా దిగుతోంది. ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఎడీఎంకేలు ఏకతాటపైకి వచ్చాయి. ఈ రెండు కూటముల మధ్య పోటీ జరుగనుంది.
ఇది కూడా చదవండి..: Modi Congress Criticism | విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్.. ప్రధాని మోదీ విమర్శలు

