అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramakrishnan Case | తమిళనాడులో మైనర్ అక్కాచెల్లెళ్లపై లైంగిక దాడికి పాల్పడిన జ్యోతిష్కుడికి శివగంగ పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి మొత్తం 200 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Ramakrishnan Case | తమిళనాడులోని శివగంగ జిల్లాలో..
తమిళనాడులోని శివగంగ Sivaganga district జిల్లాలో మైనర్ అక్కాచెల్లెళ్లపై లైంగిక దాడికి పాల్పడిన 52 ఏళ్ల జ్యోతిష్కుడు రామకృష్ణన్‌కు పోక్సో ప్రత్యేక కోర్టు (Ramakrishnan Case) కఠిన శిక్ష విధించింది. సోమవారం వెలువడిన ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021లో ఇద్దరు బాలికలు (అప్పటికి 14, 17 ఏళ్లు) చదువుల్లో వెనుకబడ్డారని భావించిన వారి తల్లి, జ్యోతిష్కుడైన రామకృష్ణన్‌ను సంప్రదించింది. పూజలు చేస్తే పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని చెప్పి బాలికలను తన ఇంటికి పిలిపించాడు.అక్కడ వారి తల్లిని ఒక గదిలో బంధించి, పూజల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లిదండ్రులు చనిపోతారని బెదిరించడంతో బాధితులు భయంతో మౌనంగా ఉన్నారు.
కేసు నమోదు, అరెస్ట్
ఈ దారుణం 2023లో వెలుగులోకి రావడంతో తిరుపట్టూర్ Tirupattur మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కేసును విచారించిన శివగంగ పోక్సో ప్రత్యేక కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి ఆర్. గోకుల్ మురుగన్ అనే నిందితుడిని దోషిగా తేల్చారు. ఇద్దరు బాధితులపై జరిగిన అఘోయిత్యం కారణంగా వేర్వేరు సెక్షన్ల కింద మొత్తం 200 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.2 లక్షల జరిమానా విధించారు. అదనంగా, బాధితులకు తలా రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఎస్సీ, ఎస్టీ చట్టం..
ఫోక్సో Protection of Children from Sexual Offences Act (POCSO) చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద ఈ శిక్ష విధించబడింది. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన ఆరోపణల నుంచి నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ తీర్పు బాలలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగిందని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..

