Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​

తెలంగాణతాజా వార్తలు

ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​

ప్రభుత్వం ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వారికి నెలకు రూ. 2 వేల స్కాలర్​షిప్​ ఇవ్వాలని నిర్ణయించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 12:40 సా.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
ATC Student Scholarship

అక్షరటుడే, వెబ్​డెస్క్: ATC Student Scholarship | రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్​న్యూస్​ చెప్పింది. అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారికి నెలకు రూ. 2 వేల స్కాలర్​షిప్​ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్​లో నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు.

Contents
  • ATC Student Scholarship | విద్యాశాఖకు రూ.26 వేల కోట్లు
    • ATC Student Scholarship | పరిశ్రమల శాఖకు..

డిప్యూటీ సీఎం భట్టి రూ.3,24,234 కోట్లతో బడ్జెట్​ ప్రవేశ పెట్టారు. పశు సంవర్థక శాఖకు 1,529కోట్లు. విద్యుత్ శాఖకు 21,285 కోట్లు కేటాయింపులు చేశారు. రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఐటీఐలను ఏటీసీలుగా అప్​గ్రేడ్​ చేసిన విషయం తెలిసిందే. కొత్త కోర్సులను సైతం ప్రవేశ పెట్టారు. విద్యార్థులకు త్వరగా ఉపాధి లభించేలా కోర్సులు రూపొందించారు. దీంతో వీటిల్లో చేరడానికి విద్యార్థులు (Students) ఆసక్తి కనబరుస్తున్నారు.

ATC Student Scholarship | విద్యాశాఖకు రూ.26 వేల కోట్లు

బడ్జెట్​లో విద్యా శాఖ (Education Department)కు రూ.26,674కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు, కార్మిక శాఖకు రూ.998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు కేటాయింపులు చేశారు. బీసీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, గృహా నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించారు.

ATC Student Scholarship | పరిశ్రమల శాఖకు..

పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. చేనేత రంగానికి 258 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు, నీటిపారుదల శాఖకు 22, 615 కోట్లు ప్రతిపాదించారు. ఆర్ అండ్ బీ శాఖకు రూ.12,789 కోట్లు, న్యాయ శాఖకు రూ.2,367కోట్లు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు, హోం శాఖకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు, పర్యాటక శాఖకు రూ.1,224 కోట్లు కేటాయింపులు చేశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు

Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి
Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Telangana Congress Women President | తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
TAGGED:ATC Student ScholarshipBhatti VikramarkaEducation DepartmentStudents
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rohith Reddy Farmhouse Case Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
Next Article Family Life Insurance Scheme Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?