Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు

తెలంగాణహైదరాబాద్

Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు

అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆలయ భూముల్లోని షెడ్లను తొలగించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 15, 2026 11:54 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Attapur Hydraa Demolition

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Attapur Hydraa Demolition | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. నగరంలోని అత్తాపూర్​లో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

అత్తాపూర్​లోని ఆలయ స్థలాన్ని కొందరు ఆక్రమించారు. అక్కడ రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా సిబ్బంది రగంలోకి దిగారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమణల నుంచి కాపాడారు. అక్రమంగా వేసిన షెడ్లను జేసీబీల సాయంతో తొలగించారు.

Attapur Hydraa Demolition | భారీ బందోబస్తు

స్థానిక శివాలయం వద్ద ఉన్న వివాదాస్పద భూముల వద్దకు ఉదయాన్నే హైడ్రా అధికారులు చేరుకున్నారు. సీతారామ చంద్రస్వామి ఆలయ భూముల్లో ఉన్న రేకుల షెడ్లను, రూమ్‌లను కూల్చివేశారు. కూల్చివేతలు ఆపాలని సిక్కులు నిరసన తెలిపారు. ఆందోళన విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.

నగరంలో వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలను హైడ్రా కాపాడింది. పార్కుల కోసం కేటాయించిన స్థలాలను సైతం కొందరు కబ్జా చేయగా.. విముక్తి కల్పించింది. నాలాలు, చెరువులు, రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తోంది. దీంతో ప్రజలు హైడ్రాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు నగరంలోని చెరువులకు హైడ్రా పూర్వ వైభవం తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బతుకమ్మ కుంట (Bathukamma Kunta), పాతబస్తీలోని బమృక్‌ ఉద్దౌలా, కూకట్​పల్లి (Kukatpally)లోని నల్ల చెరువులను పునరుద్ధరించి ప్రారంభించింది. పలు చెరువుల పనులు కొనసాగుతున్నాయి.

hydraa office

 

దీనిని కూడా చదవండి : Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
TAGGED:Hyderabad demolition driveHyderabad encroachment removalHydraatemple land encroachment
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mother Attack Children Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Next Article Fee Reimbursement Dues | Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే..
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?