Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం

జాతీయం

Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం

అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తాకాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 1:08 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Ayodhya Ram Mandir

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. శ్రీరామ నవమి (Sri Ram Navami) రోజు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడటంతో భక్తులు తన్మయత్వం చెందారు.

దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాముడి జన్మ స్థలం అయోధ్యలో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. బాలరాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో శుక్రవారం ఆలయంలోని రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. నుదిటిపై కిరణాలు తిలకంలా దర్శనం ఇచ్చాయి. మధ్యాహ్నం 12 గంటలకు రామ్ లల్లా విగ్రహం నుదుటిపైకి శాస్త్రీయ పద్ధతిలో సూర్యకిరణాలు పడ్డాయి. రాముడిపై కిరణాలు పడేలా మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి శ్రీరామ నవమికి స్వామిపై కిరణాలు పడేలా టెక్నాలజీని వినియోగించారు.

Ayodhya Ram Mandir | తరలి వచ్చిన భక్తులు

రామనవమి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. పవిత్ర స్నానం చేసిన అనంతరం, భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. “జై శ్రీ రామ్” నినాదాలతో నగరం మారుమోగింది. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

దీనిని కూడా చదవండి : Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం

PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
India Post GDS Results | పోస్టల్​ జాబ్స్​ ఫలితాలు విడుదల
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
TAGGED:Ayodhya Ram MandirAyodhya temple eventBal Ram idol sunlightHindu festival IndiaRam Janmabhoomi newsRam Navami IndiaSurya Tilak Ayodhyatemple technology
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sadabainama Registration Changes Sadabainama Registration Changes | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. సాదాబైనామా రిజిస్ట్రేష‌న్ల‌లో మార్పులు
Next Article Raghunath Temple Raghunath Temple | రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?