Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ayushman Vay Vandana Card | సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత.. రూ.5 లక్షల ఉచిత చికిత్స కవరేజీ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Ayushman Vay Vandana Card | సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత.. రూ.5 లక్షల ఉచిత చికిత్స కవరేజీ!

జాతీయం

Ayushman Vay Vandana Card | సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత.. రూ.5 లక్షల ఉచిత చికిత్స కవరేజీ!

వయో వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఇది 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వరంగా నిలుస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 5, 2026 6:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
ayushman vay vandana card

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ayushman Vay Vandana Card | 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఆయుష్మాన్ వయ వందన కార్డ్ ద్వారా ఏటా రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆదాయంతో సంబంధం లేకుండా దీనికి అందరూ అర్హులే కావడం గమనార్హం. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం (పీఎంజేఏవై)లో భాగంగా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పౌరుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆరోగ్య భద్రతా రక్షణ కవచం ఇది. ఆయుష్మాన్ వయ వందన కార్డ్ గురించి తెలుసుకుందామా..

Contents
  • Ayushman Vay Vandana Card | అందరి కోసం..
    • Ayushman Vay Vandana Card | బెనిఫిట్స్..
      • Ayushman Vay Vandana Card | ఎలా పొందాలంటే..

Ayushman Vay Vandana Card | అందరి కోసం..

వయసు పెరుగుతున్నా కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తుండడం సహజం. ముఖ్యంగా స్థిర ఆదాయం లేని వృద్ధులకు ఈ సమస్యలు ఆర్థికంగా పెద్ద భారంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులను ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకమే ‘ఆయుష్మాన్ వయ వందన’. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం (పీఎంజేఏవై)లో భాగంగా దీనిని తీసుకువచ్చారు. ఇది 70 ఏళ్ల వయసు పైబడిన వారి ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందిన ప్రత్యేకమైన పథకం. ఆదాయంతో సంబంధం లేకుండా అందరూ దీనికి అర్హులే.. ధనవంతుడైనా, నిరుపేద అయినా ఈ పథకంలో చేరవచ్చు.

వయసు ప్రాతిపదికన అర్హులైన సీనియర్ సిటిజన్లందరూ ప్రభుత్వంతోపాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రులలో రూ. 5 లక్షల వరకు నగదు రహిత చికిత్సలు పొందవచ్చు. సాధారణ వ్యాధుతోపాటు ఇందులో క్లిష్టమైన శస్త్రచికిత్సలు, పలు వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు, ఆస్పత్రిలో చేరడానికి ముందు, తర్వాత అయ్యే చికిత్స ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది.

Ayushman Vay Vandana Card | బెనిఫిట్స్..

  • ఇది వృద్ధులకు భరోసా ఇస్తుంది. వైద్య అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు, సరైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
  • 70 ఏళ్లు పైబడినవారి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు.
  • కేటరాక్ట్ సర్జరీ, హిప్ రీప్లేస్‌మెంట్, స్ట్రోక్‌తోపాటు చాలా రకాల వైద్య చికిత్సలు ఇందులో కవర్ అవుతాయి.
  • కార్డు జారీ అయిన మొదటి రోజునుంచే కవరేజీ పరిధిలోకి వస్తారు.

Ayushman Vay Vandana Card | ఎలా పొందాలంటే..

  • ఆన్‌లైన్ ద్వారా కానీ ఎంప్యానెల్డ్ హాస్పిటల్‌లో కానీ, కామన్ సర్వీస్ సెంటర్స్‌లోకానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్ ఈ కార్డు పొందడానికి ఆధార్ కార్డ్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే సరిపోతాయి.
  • ముందుగా ఆయుష్మాన్ యాప్‌నుగాని, https://beneficiary.nha.gov.in/ వెబ్‌సైట్‌ను గాని సంప్రదించాలి.
  • లాగిన్ యాజ్ ఏ బెనిఫిషియరీ ని సెలెక్ట్ చేసుకుని ఫోన్ నంబర్, అనంతరం ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • పీఎంజేవై స్కీమ్‌ను, ఆయుష్మాన్ వయ వందన సబ్ స్కీమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. ప్రక్రియ పూర్తయ్యాక కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • 1800 110 770 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చే వారు కాల్ బ్యాక్ చేసి రిజిస్ట్రేషన్‌లో సహాయం చేస్తారు.

    ఇది కూడా చదవండి..: US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!

India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
TAGGED:ayushman bharat benefitsayushman vay vandana cardfree medical treatment indiagovernment health schemehealthcare for elderlyindia health insurance schemepmjay scheme indiasenior citizens health scheme
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article belt shop tender issue | belt shop tender issue | ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెల్ట్​షాపు టెండర్.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
Next Article MIM Leader Arrest MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్​ కుమారుడి అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?