Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన

అంతర్జాతీయంతాజా వార్తలు

BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన

BA.3.2 వేరియంట్ పై పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. దీనిలో ఉన్న అధిక మ్యూటేషన్లు ఆరోగ్య రంగాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించడం ద్వారా కొత్త వేరియంట్ ప్రభావాన్ని అదుపు చేయవచ్చు.

Naresh chandan
Last updated: మార్చి 28, 2026 10:31 సా.
Naresh chandan
8 గంటలు ago
Share
BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BA.3.2 Variant | న్యూయార్క్ నగరంలో కొవిడ్​ కొత్త వేరియంట్​ స్థానికంగా ప్రజలను వణికిస్తోంది. కొత్తగా గుర్తించిన ఈ కొవిడ్-19 ఉప వేరియంట్ BA.3.2 పై శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు దృష్టి సారించారు. ఈ వేరియంట్‌లో దాదాపు 70–75 వరకు స్పైక్ ప్రొటీన్ మ్యూటేషన్లు ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణం వల్ల ఇది మనిషి శరీరంలోని రోగనిరోధక శక్తిని తట్టుకునే (immune escape) సామర్థ్యం కలిగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Contents
  • BA.3.2 Variant | వేరియంట్ ప్రత్యేకత..
    • BA.3.2 Variant | ఆరోగ్య అధికారుల స్పందన
      • టీకాలు ప్రభావం చూపుతాయా..
      • ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుందా..

BA.3.2 Variant | వేరియంట్ ప్రత్యేకత..

ఓమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా BA.3.2 వేరియంట్​ను గుర్తించారు. స్పైక్ ప్రొటీన్‌లో అధిక సంఖ్యలో మార్పులు ఉంటున్నాయి. దీనివల్ల ఈ వైరస్ మన శరీర కణాల్లోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఇప్పటికే టీకాలు తీసుకున్నవారితోపాటు గతంలో కొవిడ్ వైరస్​ బారిన పడినవారిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.

BA.3.2 Variant | ఆరోగ్య అధికారుల స్పందన

ఈ వేరియంట్‌పై న్యూయార్క్ ఆరోగ్య శాఖ నిరంతర పరిశీలన కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేసులైతే పెద్దగా లేకున్నా.. జెనోమిక్ సర్వైలెన్స్ ద్వారా మరింత సమాచారాన్ని నిపుణులు సేకరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

టీకాలు ప్రభావం చూపుతాయా..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు కొత్త వేరియంట్​ అయిన BA.3.2పై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. తీవ్రమైన అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు ఉపయోగపడొచ్చు.. కానీ సంక్రమణను పూర్తిగా అడ్డుకోకపోవచ్చని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుందా..

ఈ వేరియంట్ ను ఇప్పటివరకు న్యూయార్క్‌లో మాత్రమే గుర్తించారు. అయితే, అంతర్జాతీయ ప్రయాణాల వల్ల ఈ వైరస్​ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ఈ వేరియంట్‌పై నిశితంగా పరిశీలిస్తోంది.

Regional Ring Road Telangana | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి ముందడుగు
March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
TAGGED:BA.3.2 VariantCoronavirus UpdateCOVID-19 VariantImmune EscapeNew York COVID NewsOmicron Subvariantpublic health alertSpike Mutations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Legislators sports meet | Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Next Article Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం! Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?