Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?

అంతర్జాతీయం

Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?

హార్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలను అడ్డుకుంటూ అమెరికాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్.. మరో జలసంధిని తెరపైకి తెస్తోంది. బాబ్ అల్ మాండెబ్ జలసంధి వద్దా నౌకలను అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 5:14 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Bab el Mandeb Strait

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bab el Mandeb Strait | ఇరాన్‌పై గత నెల 28న ఇజ్రాయెల్ -అమెరికా సంయుక్తంగా చేసిన దాడులతో పశ్చిమాసియాలో మొదలైన ఉద్రిక్తతలు.. నెల గడిచినా తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పరిస్థితి క్షీణిస్తూనే ఉంది.

Contents
  • Bab el Mandeb Strait | మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న టెహ్రాన్..
    • Bab el Mandeb Strait | బాబ్ అల్ మాండెబ్ ఎక్కడుందంటే?
      • Bab el Mandeb Strait | రూ. 93 లక్షల కోట్ల సరుకుల రవాణా..

అమెరికా దాడుల నేపథ్యంలో ఆగ్రహానికి గురయిన టెహ్రాన్.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం రవాణా జరిగే హర్మూజ్ జలసంధిలో రాకపోకలను అడ్డుకుంటోంది. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు గణనీయంగా పెరిగాయి. గ్యాస్ కొరత కూడా ఏర్పడుతోంది. భారత్, రష్యా, చైనా వంటి మిత్ర దేశాల నౌకల రవాణాకు అవకాశం కల్పిస్తున్నా.. పూర్తి స్థాయిలో క్రూడ్ ఆయిల్ రవాణా జరగడం లేదు. దీంతో ప్రపంచమంతా ఇబ్బంది పడుతోంది.

Bab el Mandeb Strait | మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న టెహ్రాన్..

హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఇరాన్ దీవులలో సైన్యాలను మోహరిస్తోంది. మరోవైపు ఇజ్రాయిల్ దాడులు (Israeli Attacks) పెరుగుతుండడంతో ఇరాన్ మరో కొత్త అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సహా దాని మిత్రదేశాలు తమపై ఒత్తిడిని పెంచితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న ఇరాన్.. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని దిగ్బంధించి, ఊహించని యుద్ధ క్షేత్రాలను తెరుస్తామని హెచ్చరించింది.

Bab el Mandeb Strait | బాబ్ అల్ మాండెబ్ ఎక్కడుందంటే?

హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువతో కలిపే ఒక ప్రధాన జలమార్గం బాబ్ అల్ మాండెబ్. అరబిక్‌లో దీని అర్థం ‘కన్నీటి ద్వారం’ ఇది ఒక ప్రమాదకరమైన జల మార్గం కావడంతో దానికి ఆ పేరు వచ్చింది. సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే నౌకలు హిందూ మహాసముద్రంలోకి వెళ్లేందుకు ఈ జలసంధిని ఉపయోగిస్తాయి. అమెరికా, ఐరోపా, భారత్, చైనాలకు నౌకలు ఈ మార్గం గుండానే సాగుతాయి.

Bab el Mandeb Strait | రూ. 93 లక్షల కోట్ల సరుకుల రవాణా..

ప్రధానంగా గల్ఫ్ నుంచి యూరప్, అమెరికాలకు చమురు, సహజ వాయువు రవాణాలో ఇది ఒక కీలక మార్గం. రోజూ 45 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ దీని గుండా ఆయా దేశాలకు వెళుతుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 12 శాతం, ఎలఎన్జీలో 8 శాతం బాబ్ అల్ మాండెబ్ జలసంధి ద్వారానే సాగుతోంది. వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరకులు ఈ జలసంధి మీదుగానే రవాణా అవుతున్నట్లు అంచనా. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద జల మార్గమైన దీనిని మూసేస్తే సూయజ్ కాలువ నుంచి ప్రయాణించే నౌకలు హిందూ మహాసముద్రంలోకి చేరలేవు. సముద్ర మార్గంలో జరిగే సరుకు రవాణాకు ముఖ్యంగా క్రూడాయిల్ రవాణా నిలిచిపోతుంది. ఇప్పటికే హర్మూజ్‌ను ఇరాన్ నియంత్రించడంతో చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం తీవ్రంగా ఉంది. బాబ్ అల్ మాండెబ్ మూతపడితే ప్రపంచం మరింత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఇది కూడా చదవండి..: Visakhapatnam Oil LPG Ships | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. విశాఖకు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు

Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ
Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
TAGGED:Bab el Mandeb StraitCrude OilIsraeli AttacksKharg Island
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Egg Quality Check Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..
Next Article Hanuman Jayanti | Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?