అక్షరటుడే, బాల్కొండ: Babli Water Release | శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ (Babli Project) నుంచి నీటిని విడుదల చేశారు. నాందేడ్ నీటిపారుదల శాఖ అధికారులు (Irrigation Department) నీటి విడుదల ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Babli Water Release | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..
ఏటా వేసవి కాలంలో తాగునీటి అవసరాల నిమిత్తం మార్చి 1న బాబ్లీగేట్లు ఎత్తాలని అత్యున్నత న్యాయస్థానం (Sriramsagar Project) నుంచి ఆదేశాలున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదివారం 0.06 టీఎంసీల నీటిని దిగువకు వదులుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నీళ్లు త్వరలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను చేరుకోనున్నాయి.
Babli Water Release | ఇరు రాష్ట్రాల అధికారులు..
ఈ కార్యక్రమానికి ఇరురాష్ట్రాల నీరుపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. జలవనరుల నిర్వహణలో (Telangana) భాగంగా నీటి విడుదల చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పర్ గోదావరి డివిజన్ (Godavari River), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్, నాందేడ్ ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీఆర్ బన్సోడ్, బాబ్లీ ఇరిగేషన్ సబ్‌డివిజన్, ఉమ్రీ సబ్ డివిజనల్ ఆఫీసర్ చైతన్య, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికొట్ట, నాందేడ్ పూర్ణ సబ్‌డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భూషణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

