అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bachupally Fire Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. అనంతరం ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల్లోకి వ్యాపించాయి. దీంతో 50 షాపులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
బాచుపల్లి (Bachupally)లోని ప్రగతినగర్ ప్రాంతంలో వరుసగా ఫర్నీచర్ షాపులు ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి కేజీఆర్ కన్వెన్షన్‌ను ఆనుకోని ఉన్న ఫర్నిచర్ దుకాణంలో మొదట మంటలు చెలరేగాయి. అనంతరం నిమిషాల వ్యవధిలోనే మిగతా షాపులకు వ్యాపించాయి. అన్ని ఫర్నిచర్ షాపులే కావడంతో మంటలు త్వరగా అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Bachupally Fire Accident | 10 ఫైరింజన్లతో..
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక, హైడ్రా సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపుగా రూ.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ (Short Circuit)తో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 5 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు.
Bachupally Fire Accident | మానవత్వం చాటిన యువత
బాచుపల్లి అగ్నిప్రమాద (Fire Accident) ఘటనలో పలువురు యువకులు మానవత్వం చాటుకున్నారు. వరుసగా ఫర్నిచర్ దుకాణాలు ఉండటం, మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో ఫర్నిచర్ తరలించారు. బాధితుల కష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో ఫర్నిచర్ తరలింపునకు స్థానికులు, యువత ముందుకు వచ్చారు. సోఫా సెట్లు, కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుళ్లను భుజాలపై మోసుకెళ్లి పక్కకు పెట్టారు. దీంతో అవి కాలిపోకుండా కాపాడారు. స్థానికులతో పాటు హైడ్రా, పోలీసులు సైతం సామగ్రి తరలించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!

