అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bachupally Fire Victims | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బాచుపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50 వరకు ఫర్నిచర్ దుకాణాలు కాలిపోయాయి. బాధిత కుటుంబాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) బుధవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌తో కలిసి పరామర్శించారు.
ఈటల రాజేందర్ బాధితులతో మాట్లాడారు. సంఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. పల్నాడు, నరసరావు పేట, గుంటూరు నుంచి 20 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం వచ్చి ప్రగతి నగర్, బాచుపల్లి రోడ్డులో పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారని ఈటల అన్నారు. పెద్దవాళ్ళకు అందుబాటులో ఉండే ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇక్కడే దుకాణాలు నిర్వహిస్తూ, నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు.
Bachupally Fire Victims | విద్యుత్ లైన్ తెగిపడటంతో..
కరెంటు లైన్ తెగిపడి అగ్ని ప్రమాదం (Fire Accident) జరగడంతో బాధితుల రోడ్డు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి సంపాదించుకుంది కళ్లముందే కాలిపోయింన్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారని, మానవతా దృక్పథంతో స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తన వంతు సాయం చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి మళ్లీ వ్యాపారం చేసుకునేలా చర్యలు చేపడుతామన్నారు.
Bachupally Fire Victims | మాటలకే పరిమితం
నగరంలో చాలా చోట్ల కరెంటు తీగలు తక్కవ ఎత్తులో వేలాడుతున్నాయని ఈటల అన్నారు. బిల్డింగ్ మీద నిలబడితే చేతికి అందేలా ఉన్నాయని చెప్పారు. అనేకమంది పెద్దలు, పిల్లలు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ మాటలకే పరిమితం అవుతుందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద సైతం రక్షణ చర్యలు ఉండటం లేదన్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష

