Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స

ఆంధ్రప్రదేశ్​

Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స

శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో జాతర సందర్భంగా విక్రయించిన బాదం పాలు తాగిన తర్వాత సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి చికిత్స కొనసాగుతోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 10:29 ఉద.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Badam Milk Incident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Badam Milk Incident | శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సింగుపురం గ్రామంలో జాతర సందర్భంగా విక్రయించిన బాదం పాలు వికటించడంతో సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు.

Contents
  • Badam Milk Incident | ఆసుపత్రుల్లో చికిత్స
    • Badam Milk Incident | పాలు విక్రయించిన వ్యక్తిపై చర్యలు

వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగుపురం (Singupuram)లో ఈ నెల 1, 2 తేదీల్లో కొండమ్మ తల్లి ఉత్సవాలు (Kondamma Festivals) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తుల కోసం ఒక వ్యక్తి వ్యాన్‌లో బాదం పాలు విక్రయించాడు. ఎండ తీవ్రంగా ఉండటంతో పలువురు ఆ పాలను కొనుగోలు చేసి తాగారు.

Badam Milk Incident | ఆసుపత్రుల్లో చికిత్స

అయితే గురువారం అర్ధరాత్రి నుంచి పాలు తాగిన వారిలో ఒక్కసారిగా అస్వస్థత లక్షణాలు కనిపించాయి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ప్రారంభమవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. బాధితులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ (District Collector Swapnil Dinakar Pundkar) స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు.

Badam Milk Incident | పాలు విక్రయించిన వ్యక్తిపై చర్యలు

అలాగే ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పాలు విక్రయించిన వ్యక్తిపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా చూస్తే నాణ్యత లేని లేదా పాడైన పానీయం విక్రయించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శాంపిళ్లను సేకరించి ల్యాబ్ పరీక్షలకు (Lab Tests) పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జాతరలు, ఉత్సవాల సమయంలో ఆహారం, పానీయాలు కొనుగోలు చేసే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నాణ్యతపై సందేహం ఉంటే వెంటనే వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు. సింగుపురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Amaravati Farmers Protest | స్టూడియోలో ‘త్యాగాల’ జ్యోతి.. అమరావతి రైతుల కోసం జర్నలిస్టు వినూత్న ‘ప్రదర్శన’!

 

Macharla Rape Case | మాచర్లలో అమానుషం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ‘దిశ’ తరహాలో రేప్​!
Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ ఆరోపణలు
Road Safety Awareness | రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలి
Loan Apps | లోన్​ యాప్స్​కు మరో యువకుడు బలి
Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా
TAGGED:Andhra Pradesh NewsBadam Milk Incidentcontaminated drinksDistrict Collector Swapnil Dinakar Pundkarfestival incidentfood poisoninghealth alertLab Testspublic safetySingupuramSrikakulam DistrictSrikakulam news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Shreyas Iyer Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా
Next Article Trump Pharma Tariffs Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?