అక్షరటుడే, బాన్సువాడ : Badapahad bus accident | యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వర్ని పోలీస్ స్టేషన్ (Varni Police Station) పరిధిలోని బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Badapahad bus accident | పటాన్చెరు ప్రాంతానికి చెందిన..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు ప్రాంతానికి చెందిన యాత్రికులు ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో బడాపహాడ్ (Badapahad) పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బడాపహాడ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మూలమలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Hanuman Shobha Yatra | నగరం కాషాయమయం.. ఉత్సాహంగా హనుమాన్ శోభాయాత్ర..
